Sunday, November 24, 2024

ఊహించని ప్రమాదం..ఫైర్ హెయిర్ కటింగ్ లో యువకుడికి గాయాలు..వైరల్ గా వీడియో

ఈ మధ్యకాలంలో చాలా రకాల హెయిర్ కటింగ్స్ వచ్చాయి. తనకో డిఫరెంట్ హెయిర్ కట్ కావాలని అడిగిన యువకుడికి ఫైర్ హెయిర్ కటింగ్ చేస్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది.అత‌ని త‌ల కాలిపోయే ప్ర‌మాదానికి సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. ప్ర‌స్తుతం ఆ యుకుడు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. గుజరాత్‌లోని వల్సాద్ జిల్లా వాపి పట్టణంలోని సెలూన్‌లో 18 ఏళ్ల యువకుడు స్టైలిష్ గా క‌నిపించ‌డానికి “ఫైర్ హెయిర్‌కట్” చేయించుకోవ‌డానికి వెళ్లాడు. ఫైర్ హెయిర్ క‌టింగ్ ఈ మ‌ధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఫైర్ హెయిర్ క‌టింగ్ అంటే.. త‌ల‌పై ఉన్న హెయిర్ కు కొన్ని ర‌సాయ‌నాలు పూసి.. వెంట్రుక‌ల‌కు నిప్పు అంటించి హెయిర్ క‌ట్ చేస్తారు. ఈ స‌మ‌యంలో ఎలాంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు.

అయితే, గుజార‌త్ సెలూన్ లో ఫైర్ హెయిర్ క‌ట్ క్ర‌మంలో ప్ర‌మాదం చోటుచేసుకుంది. యువ‌కుని ప్రాణాల మీద‌కు తెచ్చింది. వెంట్రుక‌ల‌తో పాటు అత‌ని త‌ల కూడా కాలిపోయింది. ఆ యువకుడు కాలిన గాయాలకు గురయ్యాడని పోలీసులు గురువారం తెలిపారు. బాధితుడికి త‌ల‌పైనా మాత్ర‌మే కాకుండా అత‌ని ఛాతీ, మెడ‌ స‌హా ఇత‌ర శ‌రీర భాగాల‌పై గాయాలు అయ్యాయి. త‌ల‌పై మంట‌ల‌ను ఆర్ప‌డానికి ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ.. ఆవి ఆర‌కుండా.. మ‌రింతా పెరిగాయి. దీంతో ఆ యువ‌కునికి గాయాలు అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. బాధితుడిని వాపిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, గాయాలు తీవ్రంగా కావ‌డంతో అతన్ని వల్సాద్‌లోని సివిల్ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు వాపి టౌన్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసుకున్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement