కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీసినట్టు తెలుస్తోంది. ఎందుకిలా జరిగింది, ఎవరైనా ఈ ప్రమాదంలో చిక్కుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది.
కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. మూడు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. డిపార్చర్ సెక్షన్‌లోని చెక్ ఇన్ కౌంటర్‌లో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో సెక్షన్ 3 మూసి వేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే.. షార్ట్‌సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని భావిస్తున్నప్పటికీ, విచారణ జరిపిన తర్వాత కచ్చితమైన కారణం తెలుస్తుందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.