మహారాష్ట్రలో ఘోరమైన అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాల్‌ఘర్ జిల్లాలోని వాసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల విజయ్ వల్లభ కోవిడ్ ఆస్పత్రిలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది మృత్యువాత పడ్డారు. నాసిక్ లో జరిగిన ప్రమాదాన్ని మరిచిపోక ముందే ఈ సంఘటన చోటు చేసుకోవడం దిగ్ర్భాంతి కలిగిస్తోంది. ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. మిగతా రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. గుర్తు పట్టరానంతగా మృతదేహాలు కాలిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో 90 మంది రోగులు ఉన్నట్లు విజయ్ వల్లభ్ ఆస్పత్రి సీఈవో దిలీప్ షా మీడియా ప్రతినిధులకు చెప్పారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న విషయ తెలిసిందే. నిన్నటి నుంచి 67లకు పైగా తాజా కేసులు నమోదయ్యయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement