ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. హరిద్వార్‌లోని రాజాజీ పులుల సంరక్షణ కేంద్రం వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా సీ-4 బోగీలో మంటలు చెలరేగాయని తెలుస్తోంది. దీంతో వెంటనే ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపివేసినట్లు సమాచారం. మంటల కారణంగా సీ-4 బోగీ మొత్తం కాలి బూడిదైంది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది వెళ్లి మంటలను ఆర్పివేశారు. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని ఉత్తరాఖండ్ డీజీపీ వెల్లడించారు. ఈ ఘటనపై రైల్వేశాఖ దర్యాప్తు జరుపుతోందన్నారు. కాగా అగ్నిప్రమాదానికి గురైన కోచ్‌ను అక్కడే వదిలేసి.. అందులోని ప్రయాణికులను ఇతర బోగీల్లో అడ్జస్ట్ చేశారు. అనంతరం రైలు బయలువేరి డెహ్రాడూన్ వెళ్లింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement