ప్రభన్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలోని కూనారం రోడ్డులో గల రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్ సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుదాఘాతం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement