కొత్తగూడెం, భద్రాద్రి జిల్లాలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. భద్రాచలంలోని కిమ్స్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయని, దీంతో ఆ మంటలు పెద్ద ఎత్తున వ్యాపించినట్టు తెలుస్తోంది. ఈ సమచారం అందుకున్న పోలీసులు, ఫైర్ డిపార్ట్‌మెంట్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజిన్ల సహాయంతో మంటలార్పే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలోని రోగులను బయటికి తీసుకొచ్చి రక్షించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Big Breaking: భద్రాచలం కిమ్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
Advertisement
తాజా వార్తలు
Advertisement