భారత్ జీడీపీ వృద్ధి రేటు అంచనాలు ఆర్థిక సరేలో సానుకూలంగా ఉంటాయనే వార్తల నేపథ్యంలో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ఈ సరే ఫలితాలు అందుకు అనుగుణంగా ఉండటంతో దూసుకెళ్లాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 9.2 శాతంగా నమోదు అవుతుందని ఆర్థిక సర్వే అంచనాలు ఇన్వెస్టర్లకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. దీంతో ఉదయం నుంచి కొనుగోళ్లు పెరిగాయి. అంతర్జాతీయ సంకేతాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. ఉదయం 57,845.91 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్.. 58,257.63 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,746.15 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,301.05 పాయింట్ల వద్ద ప్రారంభమై.. 17,410.00 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,264.15 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరికి 813.94 (1.42 శాతం) పాయింట్లు లాభపడి.. 58,014.17 పాయింట్ల వద్ద, నిఫ్టీ 237.90 (1.39 శాతం) పాయింట్లు ఎగిసి 17,339.85 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యింది.
దాదాపు అన్ని షేర్లు లాభాల్లో..
అన్ని రంగాల షేర్లు రాణించాయి. ఆటో, ఫార్మా, ఐటీ, చమురు, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, రియల్టిd సూచీలు 1 నుంచి 3 శాతం మేర పెరిగాయి. నిఫ్టీలో టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, విప్రో, భారత్ పెట్రోలియం, బజాన్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభపడగా.. ఇండస్‌ఇండ్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, యూపీఎల్ లిమిటెడ్, కోల్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు కుంగాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటం.. ఆసియా మార్కెట్లు బలమైన సంకేతాలకు తోడు మంగళవారం కేంద్ర బడ్జెట్‌పైన సానుకూలంగా ఉన్న ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. సోమవారం సెన్సెక్స్ ఓ దశలో వెయ్యి పాయింట్లకు పైగా ఎగిసింది.
బుల్ రంకెలు.. దన్నుగా నిలిచిన ఆర్థిక సర్వే, ఇన్వెస్టర్స్ లో కొత్త ఉత్సాహం
Advertisement
తాజా వార్తలు
Advertisement