Tuesday, November 26, 2024

Economic Survey: ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మధ్యాహ్నం 2021-22 ఆర్థిక సర్వేను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనికి ముందు లోక్‌సభకు కూడా ఆర్థిక సర్వేను మంత్రి సమర్పించారు. అనంతరం లోక్‌సభ మంగళవారానికి వాయిదా పడింది. అనంతరం రాజ్యసభలోనూ ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అది పూర్తికాగానే రాజ్యసభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో కేంద్ర బడ్జెటన్ ను ప్రవేశపెట్టనున్నారు.

కాగా, 2022-23లో 8 నుంచి 8.5 శాతం ఆర్థిక వృద్ధి రేటును అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 9.2 శాతంగా నమోదవ్వొచ్చని సర్వే తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా ముందు నాటి స్థితికి చేరుకుంటుందని సర్వే అంచనా వేసింది. సేవల రంగంలో 8.2 శాతం, వినియోగంలో 7 శాతం వృద్ధి ఉండొచ్చని తెలిపింది. ఆర్థిక సర్వే ఆధారంగానే ప్రతి ఏటా బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement