Monday, November 25, 2024

నర్సింగ్‌ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీ.. 25 వరకు వెబ్‌ ఆప్షన్లు, వెబ్‌సైట్‌లో అర్హుల జాబితా

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: బీఎస్సీ నర్సింగ్‌, పీబీబీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ సీట్ల భర్తీకి ఈనెల 22వ తేది నుంచి 25వ తేదీవరకు మొదటి విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో మొదటి విడత వెబ్‌ ఆప్షన్లకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని బీఎస్సీ నర్సింగ్‌, పీబీబీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ డిగ్రీకోర్సుల్లో కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈనెల 22వ తేది ఉదయం 8 గంటల నుంచి 25వ తేది సాయంత్రం 6 గంటల వరకు తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థుల కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని మెరిట్‌ జాబితా అదేవిధంగా సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. కళాశాల వారీగా సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. మరింత సమాచారానికి డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. కెఎన్‌ఆర్‌యుహెచ్‌ఎస్‌. తెలంగాణ. జీవోవి.ఇన్‌ వైబ్‌సైట్‌లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement