కేంద్రంలోని బీజేపీ సర్కారు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచనుందని.. తక్షణమే ట్యాంకులు ఫుల్ చేయించుకోవాలే అని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ వాహనదారులకు సూచించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వ్యవహారంపై ట్వీట్ చేసింది. ‘లోటస్ డోన్ట్ లూట్ అజ్’ అనే హ్యాష్ ట్యాగ్‌పై ఆ పార్టీ తన ట్వీట్‌ను పోస్ట్ చేసింది. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే.. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచే దిశగా మోదీ సర్కారు రంగం సిద్ధం చేసినట్లుగా ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి.
ఉక్రెయిన్, రష్యాల మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగిన కారణాన్ని చూపుతూ విడతల వారీగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేందుకు మోదీ సర్కారు ఓ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ వార్తలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్లు వైరల్‌గా మారాయి.