Friday, November 22, 2024

Bilkis Bano case: 11 మంది దోషుల విడుదల.. గుజరాత్​ ప్రభుత్వాన్ని సమాధానం కోరిన సుప్రీంకోర్టు

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, పలు హత్యలకు పాల్పడిన 11 మంది దోషులను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవ్వాల (శుక్రవారం) విచారణ జరిపింది. దీనికి సమాధానం ఇవ్వాలని గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రెండు వారాల సమయం ఇచ్చింది. న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం గుజరాత్ ప్రభుత్వాన్ని అన్ని రికార్డులను దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే కేసులో నిందితులందరికీ ఉపశమనం మంజూరు చేయడానికి ఆధారాలు… 2 వారాల్లోగా తన ప్రతిస్పందనను దాఖలు చేయాలని గుజరాత్​ ప్రభుత్వాన్ని కోరింది.  

కాగా, సీపీఐ-ఎం మాజీ ఎంపీ సుభాషినీ అలీ, జర్నలిస్టు రేవతి లాల్, ప్రొఫెసర్ రూప్ రేఖా వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కూడా ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  మల్హోత్రా కాపీని, గుజరాత్ ప్రభుత్వ న్యాయవాదికి కూడా అందజేయాలని పిటిషనర్లను కోర్టు కోరింది. రిమిషన్ ఆర్డర్‌తో సహా అన్ని సంబంధిత పత్రాలను రికార్డ్ లో ఉంచాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు వారాల తర్వాత తదుపరి విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement