Saturday, November 23, 2024

UP Elections 2022: యూపీలో ఐదో విడత పోలింగ్.. కాంగ్రెస్ కంచుకోటలో ఓటింగ్

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్​ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు. 12 జిల్లాల పరిధిలోని 61 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగుతోంది. మొత్తం 692 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ కొనసాగనుంది. దాదాపు 2 కోట్ల 24 లక్షల మంది ఓటర్లు.. ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఈ విడత బరిలో యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్ మౌర్య.. సిరతు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలుస్తున్నారు. ఆయనపై అప్నాదళ్​​ నేత పల్లవి పటేల్​ పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటలుగా భావించే అమేఠీ, రాయ్‌బరేలీ, రామమందిర ఉద్యమానికి కేంద్రమైన అయోధ్యలో కూడా  ఈ విడతలోనే పోలింగ్ జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement