ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు. 12 జిల్లాల పరిధిలోని 61 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగుతోంది. మొత్తం 692 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ కొనసాగనుంది. దాదాపు 2 కోట్ల 24 లక్షల మంది ఓటర్లు.. ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఈ విడత బరిలో యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య.. సిరతు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలుస్తున్నారు. ఆయనపై అప్నాదళ్ నేత పల్లవి పటేల్ పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటలుగా భావించే అమేఠీ, రాయ్‌బరేలీ, రామమందిర ఉద్యమానికి కేంద్రమైన అయోధ్యలో కూడా ఈ విడతలోనే పోలింగ్ జరుగుతోంది.