Tuesday, November 26, 2024

మీరు లేకుండా మేం లేం నాన్న‌- ఫాద‌ర్స్ డే విషెష్ తెలిపిన సినీ సెల‌బ్రిటీలు

నేడు ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మ తండ్రుల గురించి ట్వీట్ చేస్తున్నారు. కాగా చిరంజీవి..మ‌హేశ్ బాబు ట్వీట్ చేశారు. గర్వించదగ్గ తండ్రికి.. కృతజ్ఞతగల కొడుకుగా ఉండటం గొప్ప అనుభూతి అని అన్నారు మెగాస్టార్‌ చిరంజీవి . జూన్ జూన్ 19 ఫాదర్స్ డే . ఈ సందర్భంగా సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు వరకు తమ తండ్రిని గుర్తు చేసుకుంటున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా సినీ సెలబ్రిటీలు తమ తండ్రులకు విషెస్‌ తెలియజేస్తున్నారు. వారితో ఉన్న అనుబంధాన్ని, వారితో ఉన్న గుర్తులను, జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి తన తండ్రి కొణిదెల వెంకట్‌ రావుతో దిగిన పాత ఫోటోని పంచుకున్నారు. ఆయనకు కొడుకుగా ఉండటం గొప్ప అనుభూతినిస్తుందని తెలిపారు. సూపర్‌స్టార్‌ కృష్ణ తో దిగిన ఫోటోని షేర్‌ చేశారు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు.

నాన్నగురించి ఎమోషనల్‌ వర్డ్స్ పోస్ట్ చేశారు. ఇందులో తండ్రి అంటే ఏంటో నాకు చూపించారు. తండ్రిగా ఎలా ఉండాలనే నేర్పించారు. తండ్రికి ఉదాహరణగా నన్ను నడిపించారు. మీరు లేకుండా నేను ఉండేవాడిని కాదు. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా్‌ అని పేర్కొన్నారు మహేష్‌. తను పంచుకున్న ఫోటోలు మహేష్‌, కృష్ణ ఓ ఫంక్షన్‌లో ఏదో చర్చిస్తుండటం ఆకట్టుకుంది. దర్శకుడు మెహర్‌ రమేష్ సైతం తన తండ్రి ఫోటోలను పంచుకుంటూ ఎమోషనల్‌ అయ్యారు. తండ్రి భావజాలం, నీతి, నైతికత మమ్మల్ని ఎలా ఉండాలో నేర్పించాయి. నాన్నని మిస్‌ అయి చాలా ఏళ్లు అవుతుంది. కానీ ఆయన ప్రేమ, దయ నాకు జీవితంలో ఎలా ఉండాలో, శ్రద్ధగల తండ్రిగా ఎలా నడిపించాలో నేర్పించాయి్‌ అని పేర్కొన్నారు. వీరితోపాటు మరికొందరు సెలబ్రిటీలు తమ తండ్రితో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంటూ, వారిని గుర్తు చేసుకుంటూ విషెస్‌ తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement