తన కుమారై మానసిక ఆరోగ్యం సరిగా లేదని 36ఏళ్ల కిందట బందీగా మార్చాడు కన్నతండ్రి.ఇప్పుడు ఆమెకి 53ఏళ్లు. ఆమెను తండ్రి ఓ గదిలో గొలుసులతో బంధించి ఉంచారు. బాధితురాలికి అప్పుడు 17 ఏళ్ల వయస్సు మాత్రమే ఉంది. అప్పటి నుంచి ఆమెకు ఆ కుటుంబ సభ్యులు తలుపు కింది నుంచి భోజనం పంపించేవారు. అలా తింటూనే ఆమె కాలం వెల్లదీసేది. ఆ గదిలోనే మల మూత్ర విసర్జన కూడా చేసేది. కిటికిలో నుంచి నీళ్లు పోస్తూ ఆమెకు స్నానం చేయించేవారు. 36 ఏళ్లు ఇలాగే గడిచిపోయాయి. అప్పటి నుంచి ఆమె తన గదిలో నుంచి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడలేదు. కాగా.. స్వప్నా తండ్రి గిరీష్ చంద్ ఇటీవల మరణించారు. ఆ సమయంలో స్థానిక స్వచ్ఛంద సేవా భారతి సభ్యులు ఆమె ఇంటికి వెళ్లారు. అక్కడ బాధితురాలి పరిస్థితిని చూసి చలించిపోయారు. ఆమె చుట్టూ మురికి పేరుకపోయి ఉంది. దీంతో సేవా సంస్థలోని మహిళా బృందం ఆమెకు స్నానం చేయించారు. కొత్త బట్టలు అందించారు. బాధితురాలి పరిస్థితిని ఆగ్రా మాజీ మేయర్, హత్రాస్క్ చెందిన బీజేపీ ఎమ్మెల్యే అంజులా మహౌర్ కు తెలియజేశారు. దీంతో వారు అధికారులతో కలిసి వచ్చి ఆమెకు విముక్తి కల్పించారు. అనంతరం స్వప్నాను వైద్య చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. ఈ విషయంపై సేవా భారతి సీనియర్ సభ్యురాలు నిర్మలా సింగ్ మాట్లాడుతూ.. ‘‘ మేము బాధితురాలిని చూసినప్పుడు ఆమె చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. మా ఎన్జీవో సభ్యులు ఆమెకు స్నానం చేయించి, శుభ్రమైన బట్టలు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మౌహర్ సప్నా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆమెను ఆగ్రాలోని మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ఆమెను డాక్టర్లు పరీక్షిస్తున్నారు. కొన్ని వారాల్లో ఆమె బాగుపడుతుందని ఆశిస్తున్నామని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement