చనిపోయిన తన ఏడేళ్ల కూతురి మృతదేహాన్ని భుజాలపై మోస్తూ 10 కిలోమీటర్లు మేర నడిచాడు ఓ తండ్రి. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఏడేళ్ల బాలిక లఖాన్‌పూర్ గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నిన్న ఉదయం ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆమె మృతదేహాన్ని తండ్రి భుజాలపై మోసుకుని వెళ్లాడు. 10 కిలోమీటర్ల కుమార్తె మృతదేహాన్ని భుజంపై మోస్తూ తండ్రి కాలినడకన ఇంటికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన విషయంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
మరోవైపు దీనిపై ఆసుపత్రి సిబ్బంది స్పందించారు. అంబులెన్సు త్వరలోనే వస్తుందని, అందులో మృతదేహాన్ని తీసుకెళ్తారని చెప్పామని అన్నారు. ఆలోగానే ఆ తండ్రి బాలిక మృతదేహాన్ని భుజాలపై తీసుకెళ్లాడని అంటున్నారు. ఈ రోజు దీనిపై స్పందించిన ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ డియో స్పందించారు. దీనిపై విచారణకు ఆదేశించామని, ఈ ఘటనలో హెల్త్ సెంటర్ నిర్లక్ష్యం ఉందని తేలితే, ఆ సెంటర్ మెడికల్ ఆఫీసర్‌ను బదిలీ చేస్తామని చెప్పారు. అంబులెన్సు వచ్చే వరకు ఉండాలని, ఆ తండ్రికి ఆసుపత్రి సిబ్బంది అర్థం అయ్యేలా చెప్పాల్సిందని పేర్కొన్నారు.