భారత్ లో ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. చేప కింద నీరులా ఇప్పటకే దేశంలోని చాలా రాష్ట్రాల్లో విస్తరించింది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 236కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 65, ఢిల్లీలో 64, తెలంగాణలో 24, రాజస్థాన్‌లో 21, కర్ణాటకలో 19, కేరళలో 15, గుజరాత్‌లో 14 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఇక, జమ్మూకశ్మీర్ లో 3, ఆంధ్రప్రదేశ్ లో 2, ఒడిశాలో2, ఉత్తర్ ప్రదేశ్ లో 2, ఛత్తీస్ గఢ్, లఢాఖ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ లో ఒక్కొ కేసు నమోదు అయ్యాయి. మొత్తం 236 బాధితుల్లో 104 మంది కోలుకున్నట్లు కేంద్రం తెలిపింది. మహారాష్ట్రాలో 35, ఢిల్లీలో 23, రాజస్థాన్ లో 19, కర్ణాకటలో 15 మంది ఒమిక్రాన్ బాధితులు కోలుకున్నట్లు వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital