పెళ్లిళ్లు, పేరంటాలు, శుభకార్యాల్లో… మహిళలు తమ చేతులు, పాదాలను రకరకాల మెహందీ డిజైన్లతో అలంకరించుకుంటారు. కానీ, ఓ మహిళ ఏకంగా జాకెట్ వేసుకోకుండా మెహందీనే బ్లౌజ్ గా వేయించుకంది. అంతే కాకుండా ఆ వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఈ వీడియో చూసిన చాలామందిని ఆశ్చర్యపోతుననారు. జాకెట్‌కు బదులు ఆ మహిళ తన ఎద, వీపు భాగాన్ని పూర్తిగా మెహందీ డిజైన్‌తో నింపేసింది. ఒకరకంగా ఇదీ బాడీ పెయింటింగ్ వంటిదే అని చెప్పాలేమో. ప్రస్తుతం ఆ మహిళ మెహందీ బ్లౌజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా… ఆమె చాయిస్‌పై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.
thanos_jatt అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ తన ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేశారు. నిజానికి ఆ వీడియోకి ఇచ్చిన క్యాప్షన్ చూడకపోతే… అది నిజమైన జాకెటే అని పొరపడే అవకాశం లేకపోలేదు. ‘హెన్నా బ్లౌజ్.. వాట్స్ నెక్స్ట్’ అనే క్యాప్షన్‌తో దాన్ని పోస్ట్ చేశారు. ఆ మహిళ ఎవరో ఏంటో వివరాలు తెలియదు కానీ.. తెల్లచీరపై మెహందీ బ్లౌజ్ ధరించి వయ్యారంగా నడవడం ఆ వీడియోలో కనిపిస్తోంది.
జాకెట్‌కు బదులు ఇలా మెహందీ డిజైన్ వేసుకోవాలనే ఐడియా ఎందుకు వచ్చిందో కానీ, నెటిజన్లు ఆమెను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. టైలర్ ఖర్చులు మిగుల్చుకునేందుకు ఆమె ఇలా మెహందీ బ్లౌజ్ ధరించిందా అని ఓ లేడీ నెటిజన్ సెటైర్స్ వేసింది. ఫ్యాషన్ పేరుతో ఇదేం పిచ్చి పని అంటూ మరో నెటిజన్ చివాట్లు పెట్టాడు. కొంతమంది నెటిజన్లు చెప్పలేని భాషలో ఆమెపై అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. ఆరు రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకూ 2002 లైక్స్ వచ్చాయి.