Thursday, November 21, 2024

Farmers: ఆందోళన విరమించిన రైతులు.. ఇంటి బాట పట్టిన అన్నదాతలు

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాది కాలంగా ఉద్యమం చేస్తున్న రైతులు ఆందోళలను విరమించారు. ఢిల్లీ సమీపంలోని సింఘు సరిహద్దులో రైతులు తమ టెంట్లు తీసేసి ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

మూడు సాగు చట్టాలను కేంద్రం ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. ఈ శీతాకాల సమావేశాల్లో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు బిల్లు ఆమోదం తెలపడంతోపాటు కనీస మద్దతు ధర, రైతులపై కేసులు ఎత్తివేయడం, విద్యుత్ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్లపై కేంద్రం రైతులకు హామీ ఇచ్చింది. దీంతో సంయుక్త కిసాన్ మోర్చా రైతుల తమ ఆందోళనను విరవించారు. కనీస మద్దతు ధరపై కేంద్రం కమిటీని నియమించింది.

వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలంటూ గతేడాది నవంబర్ 26న రైతులు ఢిల్లీ సరిహద్దులో ఆందోళన మొదలు పెట్టారు. ఈ ఆందోళ‌నలో ఉత్త‌ర్ ప్ర‌దేశ్, హ‌ర్యానా, పంజాబ్, ఉత్త‌రాఖండ తదితర రాష్ట్రాల నుంచి ల‌క్ష‌ల సంఖ్యలో రైతులు ఆందోళ‌నలు చేశారు. ఈ ఏడాది ఉద్య‌మ కాలంలో ఉద్య‌మంలో పాల్గొన్న 700 మంది రైతులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఇటీవల సాగు చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న‌వంబ‌ర్ 19న దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మూడు సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇందుకు కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement