ఏడాదిగా రైతులు చేస్తున్న ఉద్యమానికి తెర పడింది. దాంతో రైతులు ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేసి తమ తమ ఇళ్లకు వెళ్తున్నారు. సింఘు బార్డర్, టిక్రి బార్డర్లలో వేసిన టెంట్లు, నివాస స్థలాలను రైతులు ఖాళీ చేశారు. విజయోత్సవంతో ర్యాలీగా తమ ఇళ్ళకి తిరుగుముఖం పట్టారు. రీసెంట్ గా రైతు చట్టాలు వెనక్కి తీసుకోవడంతో రైతులు వారి సొంత ఊర్లకి తిరుగు ప్రయాణం అయ్యారు. పార్లమెంట్ శీతాకాలం సమావేశాల తొలిరోజే కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది. దీంతో పాటు రైతులే చేసిన పలు డిమాండ్లను కేంద్రం అంగీకరించింది. రైతులు వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు మద్దతు ధర హామీ చట్టం, రైతులపై కేసులు ఎత్తివేయడంతో పాటు విద్యుత్ చట్టాలను కూడా రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కేసులు ఎత్తివేస్తామని.. మద్దతుధర విషయమై కేంద్రం కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో రైతులు ఏడాదిగా చేస్తున్న ఉద్యమానికి తెర పడింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement