ప్రముఖ ఒడిశా సాహితీవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత బినాపాని మొహంతి మృతి చెందారు. ఆమె మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. మొహంతి వయస్సు 85 సంవత్సరాలు. ఒడిశాలోని కటక్‌లోని తన స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. ఒడియా సాహిత్యానికి ఆమె సాధించిన “స్మారక విజయాలు”, ముఖ్యంగా కాల్పనిక రచనలు, ఆమె రచనలు అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి ..జ గుర్తింపు పొందాయని ప్రధాన మంత్రి ప్రశంసించారు. ప్రఖ్యాత రచయిత బినాపాని మొహంతి జీ మరణం చాలా బాధాకరం. ఆమె ఒడియా సాహిత్యంపై, ముఖ్యంగా కల్పన రచనపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఆమె నవలలు అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి .. చాలా ప్రజాదరణ పొందాయి. ఆమె కుటుంబ సభ్యులకు ..స్నేహితులకు హృదయపూర్వక సానుభూతి. శాంతి ఓం, అని ప్రధాన మంత్రి ట్వీట్ చేశారు.బినాపాని మొహంతి 1936లో బెర్హంపూర్‌లో జన్మించారు. 100కి పైగా పుస్తకాలు రాశారు. ఆమె శైలబాలా మహిళా కళాశాలలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు. మొహంతి కవిగా తన సాహిత్య జీవితాన్ని ప్రారంభించారు.. సుమారు 200 కవితలు రాశారు. ఆమెకు 2020లో సాహిత్యం .. విద్యా రంగంలో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఒడిశా సాహిత్య అకాడమీ కూడా ఆమెను గౌరవనీయమైన ‘అతిబడి జగన్నాథ దాస్’ అవార్డుతో సత్కరించింది. ఒడిశా ప్రభుత్వం ఆమెకు సాహిత్య అకాడమీ అవార్డు మరియు సరళ సమ్మాన్‌ను కూడా అందించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement