తెలంగాణ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడానికి ఢిల్లీ నుంచి డీల్స్ చేసిన మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో దర్యాప్తు స్పీడప్ అవుతోంది. నిన్న హైకోర్టు విచారణకు ఆదేశించడంతో ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు కోసం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని ఏర్పాటు చేసింది.
ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)లో సభ్యులుగా నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కమలేశ్వర్ , నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్‌రెడ్డి, మొయినాబాద్సీఐ లక్ష్మిరెడ్డి ఉన్నారు. ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఎందుకంటే ఈ కేసులో ఢిల్లీ నుంచి ఆపరేట్ చేసినట్టు పలు ఆరోపణలు వస్తున్నాయి. కేంద్రంలోని పెద్దలు, బీజేపీ బడా లీడర్ల పేర్ల ప్రస్తావన ఉండడంతో ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పారదర్శకంగా కేసు విచారణ ఉండేలా చర్యలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం.