హైదరాబాద్ : కోకా-కోలా ఇండియా ప్రవేశపెట్టిన కొత్త బ్రాండ్ ఏంటో తెలుసా? ఈ వేసవిని చల్లగా ఆస్వాదించడానికి ఫాంటా రూపంలో కొత్త కొత్త ప్రొడక్టులను తీసుకొస్తోంది ఈ కంపెనీ. అందులో భాగంగా యాపిల్ డిలైట్ ఫ్రూట్ జ్యూస్ పేరిట కొత్త వేరియంట్‌తో ముందుకొచ్చింది. దీనికిప్పుడు సమంతా బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం నిర్వహిస్తోంది. మధురమైన పళ్ల రుచి గల ఈ వేరియంటుతో విస్తరిస్తూ ఫాంటా యొక్క కొత్త రుచి అయిన యాపిల్ డిలైట్ ఆవిష్కరణను ప్రకటించింది. ఈ వేసవిలో ఇండియాలోని వినియోగదారులు తమ మనస్సు, శరీరం.. స్ఫూర్తిని తాజాగా ఉంచుకోవడానికి నిజమైన యాపిల్ పళ్ల రసంతో మెరిసే పానీయాన్ని ఆస్వాదించగలుగుతారు. సమంతా రూత్ ప్రభు ఫాంటా యాపిల్ డిలైట్ ఆస్వాదిస్తున్నట్లుగా ఓ ప్రకటనలో చూడవచ్చు.
ఈ వేసవి తొలి రోజుల్లోనే ఇండియా లోని మార్కెట్ల వ్యాప్తంగా షెల్ఫులపై ఈ కొత్త వేరియంట్ అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా సగం మిలియన్ కంటే ఎక్కువ ఔట్‌లెట్లలో చిల్లరగా విక్రయించేందుకు ఫాంటా ప్లాన్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల యాపిల్ వేరియంట్లలో ఫాంటా లభిస్తుంది. అని ఫాంటా ప్రతినిధులు తెలిపారు. ఆరంజ్ విభాగములో ఫాంటా మార్కెట్ వాటా అగ్రగామిగా ఉందని, కాగా, ఈ వేరియంటుతో మొత్తం పళ్ల -రుచి విభాగములో తనకు తానుగా వృద్ధి కావాలని బ్రాండు లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు.