క్రికెటర్ రోహిత్ శర్మ కోసం ఓ అభిమాని భద్రతని ఉల్లంఘించి మైదానంలోకి ప్రవేశించాడు. తిరువనంతపురం వేదికగా దక్షిణాఫ్రికాతో గురువారం రాత్రి జరిగిన మొదటి టీ20 సందర్భంగా ఒక అభిమాని భద్రతను ఉల్లంఘించి మైదానంలోకి ప్రవేశించాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాదాలను తాకాడు. భారత్ ఫీల్డింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారి ఉలిక్కిపడ్డ భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్ కోసం తిరువనంతపురం వచ్చిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి అభిమానులు భారీ కటౌట్ లతో స్వాగతం పలికారు. మూడు మ్యాచ్ ల సిరీస్లో భాగంగా జరిగిన ఈ పోరులో భారత్ 8 వికెట్లతో తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. తొలుత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 స్కోరు మాత్రమే చేసింది. తర్వాత కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ అజేయ అర్ధ సెంచరీలతో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం గువాహతిలో జరుగుతుంది.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాదాలను తాకిన అభిమాని-ఉలిక్కిపడ్డ భద్రతా సిబ్బంది
Advertisement
తాజా వార్తలు
Advertisement