Tuesday, November 26, 2024

ప్ర‌ముఖ బాలీవుడ్ సింగ‌ర్ – భూపింద‌ర్ సింగ్ క‌న్నుమూత‌

బాలీవుడ్ ప్ర‌ముఖ సింగ‌ర్ భూపింద‌ర్ సింగ్ క‌న్నుమూశారు..ఆయ‌న కోవిడ్ సంబంధ సమస్యలు, కొలాన్ క్యాన్సర్‌ కారణంగా మరణించినట్టుగా ఆయన భార్య, గాయని మితాలీ ముఖర్జి వెల్లడించారు.82 ఏళ్ల భూపిందర్ సింగ్ పది రోజుల క్రితం హాస్పిటల్‌లో చేరినట్టు మితాలి ముఖర్జీ ఓ న్యూస్ ఏజెన్సీకి వివరించారు. యూరీన్‌‌లో ఇన్ఫెక్షన్ రావడంతో ఆయనను హాస్పిటల్‌తో చేర్చినట్టు తెలిపారు. ఆయనకు పలు టెస్టులు చేసిన తర్వాత కొవిడ్ పాజిటివ్ అని తేలిందని పేర్కొన్నారు. ఈ రోజు రాత్రి 7.45 గంటల ప్రాంతంలో ఆయన మరణించినట్యటు చెప్పారు. కొలాన్ క్యాన్సర్, కొవిడ్ సమస్యల కారణంగా ఆయన మరణించినట్టు భావిస్తున్నామని తెలిపారు.

ఐదు దశాబ్దాల తన కెరీర్‌లో భూపిందర్ సింగ్ ఎన్నో అద్భుత గేయాలకు ప్రాణం పోశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో దిగ్గజ సంగీత దర్శకులతో పని చేశారు. మహమ్మద్ రఫీ, ఆర్‌డీ బర్మన్, లతతా మంగేష్కర్, ఆశా భోస్లే, బప్పి లహిరి వంటి ప్రముఖులతో ఆయన కలిసి పని చేశారు. పంజాబ్‌లో జన్మించిన ఈ సింగర్ దల్ డూండ్తా హై, నామ్ గమ్ జాయేగా, ఏక్ అకేలా ఇస్ షెహెర్‌ మే, కిసి నజర్ కో తేరా ఇంతెజార్ ఆజ్ భీ హై, దునియా ఛుటే యార్ న ఛుటే వంటి ఫేమస్ సాంగ్‌లు పాడారు. ఆయన మరణంతో బాలీవుడ్ చిత్ర సీమ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పలువురు సంతాపం వ్యక్తం చేశారు. పాటల ప్రపంచంలో ఆయన లోటు తీర్చలేనిదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement