యూకేలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. 11 ఏళ్లకే గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చిన ఓ బాలిక ఆశ్చర్య పరిచింది. అంతేకాదు యంగెస్ట్ మదర్‌గా రికార్డ్ సృష్టించింది. యూకేలోని స్థానిక వార్తాపత్రిక కథనం ప్రకారం.. 11 ఏళ్ల ఓ బాలిక ఈ నెలలో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యంగా ఉన్నట్టు సమాచారం. అయితే, బాలిక గర్భంతో ఉన్న సంగతి ఆమె తల్లిదండ్రులకు కూడా తెలియలేదు. ఈ విషయం తెలిసిన వెంటనే వారు షాక్ కి గురైయ్యారు. బాలికకు పదేళ్లు ఉన్నప్పుడే గర్భం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే 10 ఏళ్లకే బాలికకు గర్భం ఎలా వచ్చింది? తల్లిదండ్రులకు తెలియకుండా ఎలా జరిగింది? అనే విషయం ఆందోళన కలిగిస్తోంది.
దీనిపై స్పందించిన డాక్టర్ కారల్ కూపర్.. యంగ్ మదర్ తనే అన్న విషయం తెలియదన్నారు. కానీ అమ్మాయిలు 8-14 సంవత్సరాల మధ్య ఎప్పుడైనా యుక్తవయసులోకి వస్తారని, కాబట్టి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని చెప్పారు. పెరూ దేశానికి చెందిన ఈ అమ్మాయి 11ఏళ్లకే తల్లి కాగా చరిత్రలో యంగెస్ట్ మదర్ రికార్డు మాత్రం మరొకరి పేరున ఉంది. 1939లోనే పెరూకు చెందిన లినా మెడీనా అనే బాలిక 6 ఏళ్ల వయసులో శిశువుకు జన్మనిచ్చింది.
కాగా గడిచిన 30 ఏళ్లలో ఇలాంటివి 4 కేసులు నమోదైనట్టు డాక్టర్ వెల్లడించారు. ఇక యూకేలోనే సొంత సోదరుడు అత్యాచారం చేయడంతో ట్రెస్సా అనే అమ్మాయికి 12ఏళ్లకే బిడ్డ పుట్టింది. దాంతో తన పేరు మీదనే యంగెస్ట్ మదర్ రికార్డ్ ఉండగా.. ప్రస్తుతానికి యూకే యంగెస్ట్ మదర్‌గా పెరూ బాలిక నిలిచింది.
ఇదీ చదవండి: బ్లూ జీన్స్ ధరిస్తే…కఠినమైన శిక్ష..!