ఉత్తర ప్రదేశ్లో ప్రతిరోజు మహిళలపై దాడులు జరగడం సర్వ సాధారణంగా మారింది. లేటెస్ట్ గా ఓ యంగ్ ఏజ్ అమ్మాయికి కృష్ణ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పరిచయమయ్యాడు. ఫ్రెండ్ షిప్ పేరుతో ఆమెతో చాట్ చేసేవాడు.. అతని పోస్టింగులు చూసి ఆమె కూడా అతడిపై నమ్మకం పెంచుకుంది. ఓ రోజు కారులో బయటికి వెళ్దామని చెప్పడంతో ఓకే యువతి ఆ చెప్పింది.
అలా కారులో యువతని తీసుకెళ్లిన అతను కొంత దూరం వెళ్లాక బలవంతంగా మద్యం తాగించాడు. అంతేకాకుండా కారులోనే అఘాయిత్యానికి (రేప్) పాల్పడ్డాడు. ఈ తతంగం అంతా అతని స్మార్ట్ ఫోన్ లో రికార్డు చేశాడు. ఇకమీదట తను చెప్పినట్టు వినకపోయినా.. ఈ విషయం ఎవరికైనా చెప్పినా ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి పరువు బజారుకీడుస్తానని బెదిరించాడు. దీంతో ముందుగా భయపడ్డప్పటికి ఆ తర్వాత డేర్ చేసిన ఆ యువతి నేరుగా పోలీస్ స్టేషన్ కి కంప్లెయింట్ చేసింది. దీన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.