Friday, November 22, 2024

Analysis: పడిపోతున్న పసిడి ధరలు.. వారంలోనే రూ. 2 వేలకుపైగా పతనం

ర‌ష్యా-ఉక్రెయిన్ వార్‌ నేపథ్యంలో తొలుత పరుగుల పెట్టిన బంగారం రేటు ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది. యుద్ధం మొదలైనప్పుడు బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నారు. ఫలితంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచనున్న నేపథ్యంలో మదుపరులు బంగారం నుంచి పెట్టుబడులు ఉపసంహరిస్తున్నారు.

ఫలితంగా అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగానూ పుత్తడి, వెండి ధరలు తగ్గుతున్న‌ట్టు మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఈ నెల 8న అంతర్జాతీయ విఫణిలో ఔన్సు బంగారం ధర గరిష్ఠంగా 2069 డాలర్లకు చేరింది. నిన్న‌ మాత్రం ఇది 1915 డాలర్లకు క్షీణించింది. ఇక, భారత బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛ‌మైన బంగారం ధర రూ. 53 వేలు ఉండగా, వెండి ధర కిలో రూ. 69,600 ఉంది. ఈ నెల 8న వీటి ధరలు వరుసగా రూ.55,100, రూ. 72,900 ఉన్నాయి. అంటే వారం రోజుల వ్యవధిలో బంగారంపై రూ. 2,100, వెండిపై రూ. 3,300 తగ్గడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement