Tuesday, November 26, 2024

త‌గ్గుతున్న గోల్డ్ రేట్‌.. కొనాలంటే ఇప్పుడే బెట‌ర్ అంటున్న వ్యాపారులు

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో బంగారం ధరలు నిన్నటితో కంపేర్ చేస్తే ఇవ్వాల త‌గ్గాయి. ఇవ్వాల 10 గ్రాముల బంగారంపై రూ. 250 తగ్గింది. ఉక్రెయిన్ – రష్యా వార్ త‌ర్వాత‌ కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్నాయి. ఇక వెండి ధర ఇవ్వాల‌ కిలోకు రూ.800 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.47,600గా ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.270 తగ్గడంతో.. ఈ రేటు రూ.51,930 వద్ద నమోదైంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.67,700గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

బంగారం ధ‌ర‌లు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,600 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,060గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,600 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,060గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.

వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 61,900 ఉండగా, ముంబైలో రూ.61,900గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.67,700 ఉండగా, కోల్‌కతాలో రూ.61,900గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,700 ఉండగా, కేరళలో రూ.67,700గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,700 ఉండగా, విజయవాడలో రూ.67,700 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement