Monday, November 18, 2024

ఫేక్ స‌ర్టిఫికెట్లు ఉంటే – క్రిమిన‌ల్ కేసులు

ఫేక్ స‌ర్టిఫికెట్ల‌తో ఉద్యోగాల‌కి అప్లై చేస్తే క్రిమిన‌ల్ కేసులు పెడ‌తామ‌ని అధికారు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ రూల్స్‌-పేరా 9 (ఏ) రూల్‌ 3 (11) ప్రకారం సదరు అభ్యర్థులను ఐదేండ్ల పాటు డిబార్ చేస్తామ‌న్నారు. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ మరో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇతర ఉద్యోగాలకు కూడా విడతల వారీగా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌)లో మార్పులు చేసుకొనే అవకాశం కల్పించారు. అయితే, కొందరు అభ్యర్థులు విద్యార్హతలు, స్థానికతకు సంబంధించిన ఫేక్‌ సర్టిఫికెట్లను సమర్పించే అవకాశమున్నట్టు టీఎస్‌పీఎస్సీ దృష్టికి వచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఫేక్‌ సర్టిఫికెట్లకు ఎక్కువ ఆస్కారం ఉన్నదని, ఇప్పటికే ఇలాంటివి అత్యధికంగా జరుగుతున్నాయని తెలిసింది. మూతబడ్డ స్కూళ్లు, కొన్ని ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి తప్పుడు సర్టిఫికెట్లు తీసుకొచ్చే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. స్థానికేతరులు ఉద్యోగాలు కొల్లగొట్టే ప్రమాదం ఉన్నదని, దీనికి అడ్డుకట్ట వేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు వెల్లడించారు. ఫేక్‌ సర్టిఫికెట్ల ఘటనలు గతంలో చోటుచేసుకోవటంతో కమిషన్‌ సభ్యులు అప్రమత్తమయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన బాధ్యతలను కలెక్టర్లకు అప్పగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మెరిట్‌ జాబితాలోని అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను టీఎస్‌పీఎస్సీయే చేపట్టినా, అనుమానాలున్న సర్టిఫికెట్ల బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement