Wednesday, November 20, 2024

ఫ్యాక్ట్ చెక్: చికెన్ తో బ్లాక్ ఫంగ‌స్‌ వస్తుందా?

దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతుంటే… బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది.  దేశవ్యాప్తంగా కరోనా రోగులు ఫంగస్‌ల బారినపడి మరణిస్తున్న ఘటనలు అధికమవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ విజృంభిస్తున్నాయి. అయితే, బ్లాక్ ఫంగ‌స్ పై ఎన్నో అనుమానాలు, సందేహాలు నెలకొన్నాయి. తాజాగా చికెన్ ద్వారా బ్లాక్ ఫంగ‌స్ వ‌స్తుందంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. గాలిలో ఉండే బ్లాక్​ ఫంగస్​.. కోళ్లకి కూడా వస్తుందని వాటిని తింటే మ‌నుషుల‌కు వ‌స్తుంద‌ని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఐసీఎంఆర్​ సీనియర్​ సైంటిస్ట్ డాక్టర్ అపర్ణ ముఖర్జీ స్పందించారు. గాలిలో ఉండే బ్లాక్​ ఫంగస్​.. కోళ్లకి కూడా వస్తుందని అని తెలిపారు. అయితే, చికెన్ తింటే బ్లాక్ ఫంగ‌స్ రాద‌ని స్ప‌ష్టం చేశారు. బ్లాక్​ ఫంగస్​ అంటువ్యాధి కాదని, అలాంటప్పుడు జంతువులు, మనుషుల్లో ఒకరి ద్వారా మరొకరికి సోకుతుందన్న వాదనలో నిజం లేదని ఆమె తేల్చి చెప్పారు. ప్రజలు ఈ ప్రచారానని న‌మ్మొద్ద‌ని కోరారు.

కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్‌ ఫంగస్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్న వారు దీని బారిన పడుతున్నారు. స్టైరాయిడ్లు ఎక్కువగా వాడే వారికి బ్లాక్​ ఫంగస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్టైరాయిడ్లను వైద్యుల సూచన మేరకే తీసుకోవాలని చెబుతున్నారు. ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకినవారిలో కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రబారడం, నొప్పి తలెత్తడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరి అందకపోవడం, రక్తవాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement