ఆర్ఆర్ఆర్ చిత్రానికి టికెట్ ధరలు ఏ స్థాయిలో పెరిగాయో అందరికి తెలిసిందే. అలాగే రాధే శ్యామ్ చిత్రానికి కూడా. ఆ తర్వాత వచ్చిన ఆచార్య చిత్రానికి కూడా టికెట్ మల్టీఫ్లెక్స్ లలో అదనంగా రూ 50, సింగిల్ స్క్రీన్స్ లో రూ 30 పెంచుకునేలా ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. కంటెంట్ బావున్న చిత్రాలు నిలదొక్కుకుంటున్నాయి. కానీ యావరేజ్ గా, నెగిటివ్ టాక్ వస్తే మాత్రం సోమవారం నుంచే దారుణమైన దెబ్బ పడుతోంది. ఆచార్యకి ఆ పరిస్థితి చూశాం. ఈ స్థాయిలో టికెట్ టికెట్ కొని సినిమా చూసే బదులు ఓటిటిలో చూసుకుంటే పోలా అనే అభిప్రయానికి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారు. దీనితో వసూళ్ల జోరు 2,3 రోజులకే ఆగిపోతోంది. ఈ పరిస్థితిని ఎఫ్3 చిత్ర టీం గుర్తించారు. ఎఫ్2ని మించేలా ఎఫ్3 చిత్రం నవ్వులు పండించబోతున్నట్లు అర్థం అవుతోంది. దర్శకుడు అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎఫ్3 చిత్రానికి టికెట్ ధరలు పెంచకుండా సాధారణ ధరలతోనే రిలీజ్ చేయాలనే నిర్ణయానికి ఎఫ్3 నిర్మాతలు వచ్చారు. ఎందుకంటే ఎఫ్3 లాంటి చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ చాలా కీలకం. లాంగ్ రన్ ముఖ్యం. వెంకటేష్ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కడతారు. టికెట్ ధరలు పెంచితే కొంతమంది ఆగిపోయే ప్రమాదం ఉంది. దీనితో నిర్మాతలు అత్యాశకు పోకుండా ఈ చిత్రాన్ని నార్మల్ రేట్స్ తోనే రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారట. ఎఫ్2 చిత్రం ప్రస్తుతం ఉన్న టికెట్ ధరల కంటే తక్కువ ప్రైస్ తోనే 2019లో దాదాపు 80 కోట్ల షేర్ ని సాధించింది. ఎఫ్3 చిత్రానికి హిట్ టాక్ వచ్చి.. టికెట్ ధరలు రీజనబుల్ గా ఉంటే చాలు.. కలెక్షన్స్ వాటంతట అవే వస్తాయని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. మరి వారి నిర్ణయాన్ని సినిమా లవర్స్ ప్రశంసిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement