Tuesday, November 26, 2024

విప‌క్షాలు ఏక‌మైతే.. బిజెపి ఇంటికే .. శ‌శిథ‌రూర్

2019ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను 2024లో పున‌రావృతం చేయ‌డం బిజెపికి సాధ్యం కాద‌ని చెప్పారు కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్. కోజికోడ్ లో జరిగిన కేరళ లిటరేచర్ ఫెస్టివల్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాలలో అధికారం కోల్పోయిన బీజేపీ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలోనూ అధికారం కోల్పోవచ్చని శశిథరూర్ అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో హర్యానా, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని అన్ని లోక్ సభ స్థానాల్లోనూ బీజేపీ గెలిచిందని, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో ఒక్కో సీటు తప్ప మిగతా స్థానాలు కైవసం చేసుకుందని శశిథరూర్ తెలిపారు.

మొత్తంగా 543 లోక్ సభ స్థానాలకు గానూ 303 సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకుందని గుర్తుచేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు 272 సీట్లు అవసరం కాగా.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఈ మార్కును అందుకోలేదని చెప్పారు. ఇది విపక్షాలకు అవకాశంగా మారుతుందని, విపక్షాలు ఏకతాటిపై నిలబడితే బీజేపీని అధికారానికి దూరం చేయొచ్చని శశిథరూర్ అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement