దేశంలోని అనేక ప్రాంతాల్లో హీట్ వేవ్ మరింత ఉధృతం కానుందని, రాబోయే రోజులలో మరింత ఎండలు ముదురుతాయని భారత వాతావరణ విభాగం (IMD) సోమవారం తెలిపింది. రేపు, ఎల్లుండి పశ్చిమ రాజస్థాన్‌లో హీట్ వేవ్ నుండి తీవ్రమైన హీట్ వేవ్ పరిస్థితులను ఉంటాయని అధికారులు అంచనా వేశారు. మార్చి 31, ఏప్రిల్ 1 న హీట్ వేవ్ పరిస్థితులు మరింతగా ఉంటాయని తెలిపారు. జమ్మూ డివిజన్, హిమాచల్ ప్రదేశ్ (మార్చి 28-29), దక్షిణ హర్యానా (మార్చి 29-30), సౌరాష్ట్ర-కచ్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ (మార్చి 28 ఏప్రిల్ 1), విదర్భలో హీట్ వేవ్ పరిస్థితుల తీవ్రంగా ఉంటాయని IMD హెచ్చరికలు జారీ చేసింది.
ఈ క్రమంలో చిన్నారులు, ఓల్డ్ ఏజ్ వారు.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తుల హెల్త్ మరింత విషమించే ప్రమాదం ఉందని, ఎక్కువగా ఎండల్లో ఉండకూడదని అధికారులు వెల్లడించారు. తగినంత నీరు తాగి, వేడికి గురికాకుండా ఉండాలని.. తేలికైన, లేత-రంగు, వదులుగా, ఉండే దుస్తులు ధరించాలని సూచించారు. ORS, లస్సీ, నిమ్మ నీరు, మజ్జిగ వంటి ఇంట్లో తయారుచేసిన పానీయాలను తాగాలని తెలిపారు.