Friday, November 22, 2024

Exclusive | తెలంగాణలో రైతుల పేరుతో దోపిడీ.. బీజేపీతోనే పారదర్శక అభివృద్ధి: ప్రధాని మోదీ

తెలంగానలో రైతుల పేరుతో దోపిడీ జరుగుతోందని, కాలువలు, ప్రాజెక్టుల పేరుతో నిధులు విడుదల అవుతున్నా ఎక్కడా పనులు జరగడం లేదని విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. మహబూబ్​నగర్​లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రైతులకు బీజేపీ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోందని, పసుపు బోర్డు ప్రకటించిందని అన్నారు. ప్రధాని మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే..

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

పేదలకు ఇండ్లు, గ్యాస్​ ఉచితంగా అందిస్తున్నాం. మహిళల జీవితాన్ని మెరుగుపరిచే కార్యక్రమాన్ని చేపట్టాం. చట్ట సభల్లో మహిళల ప్రాతినిథ్యం పెరిగింది. మహిళా బిల్లును ఆమోదించుకున్నాం. ఎటువంటి గ్యారెంటీ లేకుండా ముద్రా రుణాలు అందిస్తున్నాం. ఢిల్లీలో ఒక అన్న ఉన్నారనే విషయాన్ని మీరంతా గుర్తుంచుకోండి.  

2014 వరకు తెలంగాణలో ఉన్న రహదారులను అభివృద్ధి చేశాం. పల్లె, పట్టణాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాం. తెలంగాణ ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ 9 ఏండ్లలో 2500 కి.మీ రోడ్లను అభివృద్ధి చేశాం. అన్నదాతలను గౌరవిస్తున్నాం. వారి కష్టానికి తగిన ఫలితాన్ని కల్పిస్తున్నం నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లేలా చేశాం. తెలంగాణలో రైతుల పేరుతో కేసీఆర్​ ప్రభుత్వం ఆదాయ మార్గంగా మార్చుకుందని, సాగునీటి ప్రాజెక్టుల పేరుమీద పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది. దోపిడీ మీరు గమనిస్తున్నారు. రైతు పథకాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోంది.

- Advertisement -

తెలంగాణలో మా సర్కారు లేకున్నా.. రైతులకు మేలు జరిగే పనులు చేపడుతున్నాం. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 6,300 కోట్లను ఖర్చుపెట్టి పునరుద్ధరించాం.  ప్రధాని కిసాన్​ సమ్మాన్​ యోజన కింద రైతులకు 10వేల కోట్లను అందించాం.

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుతో ఎంతో మేలు జరగనుంది. దేశవ్యాప్తంగా జరిగే పసుపు ఎక్స్​పోర్టులో తెలంగాణ ఎక్కవ స్థాయిలో ఉంది. అందుకని ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని భావించాం. పసుపు వంటి బంగారు దినుసులను పండించే రైతులను ఆదుకునేందుకు దేశంలోనే ప్రత్యేకమైన చర్యలు తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement