అమరావతి, ఆంధ్రప్రభ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే మరికొద్ది రోజుల పాటు పొడిగించింది. ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 26 వరకు తిరుపతి-ఔరంగాబాద్ మధ్య ప్రతి ఆదివారం, ఔరంగాబాద్-తిరుపతి మధ్య ప్రతి సోమవారం ప్రత్యేక రైలును నడుపుతారు. హెచ్‌ఎస్ నాందేడ్-తిరుపతి మధ్య సోమవారం, తిరుపతి-హెచ్‌ఎస్ నాందేడ్ మధ్య ప్రతి మంగళవారం ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 27 వరకు నడపనున్నారు. కాచిగూడ-నర్సాపూర్, నర్సాపూర్-తిరుపతి, తిరుపతి-కాచిగూడ మధ్య ప్రతి సోమ, మంగళ, బుధవారం నడిచే రైళ్లను సెప్టెంబర్ 5 నుంచి 28వ తేదీ వరకు, హెచ్‌ఎస్ నాందేడ్-తిరుపతి, తిరుపతి-హెచ్‌ఎస్ నాందేడ్ మధ్య శుక్ర, శనివారాల్లో నడిచే రైళ్లను సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు, హైదరాబాద్-తిరుపతి, తిరుపతి-హైదరాబాద్ మధ్య శనివారం నుంచి మంగళవారం వరకు రాకపోకలు సాగించే రైళ్లను ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 27వ తేదీ వరకు, విజయవాడ-నాగర్‌సోల్, నాగర్‌సోల్-విజయవాడ మధ్య శుక్ర, శనివారాలు రాకపోకలు సాగించే రైళ్లను ఈ నెల 26 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Railway: మరికొద్ది రోజులు ప్రత్యేక రైళ్ల పొడిగింపు.. వెల్లడించిన దక్షిణ మధ్య రైల్వే
Advertisement
తాజా వార్తలు
Advertisement