Friday, November 22, 2024

తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ పొడిగించే ఛాన్స్ ?

తెలంగాణలో లాక్‌ డౌన్ మరో వారం రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ మొదటి వారం వరకు లాక్ డౌన్ పొడిగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ తో రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత రెండు, మూడు రోజులుగా పాజిటివ్ కేసులు 3 వేలలోపే నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా కట్టడికి లాక్ డౌన్ పొడిగించాని వైద్యశాఖ భావిస్తున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ గడువు మే 31తో పూర్తి కానుంది. దీంతో లాక్ డౌన్, కరోనా కట్టడిపై ఈనెల 28న సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ పోడిగింపుపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో లాక్ డౌన్‌ సత్ఫలితాలు ఇస్తున్న ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజులపాటు పొడిగిస్తే మంచిదనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణలో మే 12 నుంచి లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల కోనుగోలు చేసేందుకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నాలుగు గంటలపాటు సమయం ఇచ్చారు. రోజూ 20 గంటల పాటు కఠినంగా లాక్ డౌన్‌ను అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా కఠినంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపై వచ్చే వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. లాక్ డౌన్ సత్ఫలితాలు ఇస్తుండటం.. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతోన్న నేపథ్యంలో ఇంకాస్త కఠినంగా లాక్ డౌన్ విషయంలో ముందుకెళ్లాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement