Wednesday, November 20, 2024

తెలంగాణ‌లో ఈనెల 31వ‌ర‌కూ కోవిడ్ ఆంక్ష‌ల పొడ‌గింపు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఆంక్షలు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. ఈ రోజుతో తెలంగాణలో కరోనా ఆంక్షలు ముగుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కోవిడ్ ఆంక్షలు ఈనెల 31 వరకు పొడగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్ప‌టికే తెలంగాణ వ్యాప్తంగా.. రేప‌టి నుంచి ఫీవ‌ర్ స‌ర్వే నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. మ‌రోవైపు క్ర‌మంగా కోవిడ్ కేసుల పెరుగుతోన్న నేప‌థ్యంలో అల‌ర్ట్ అయిన రాష్ట్ర ప్ర‌భుత్వం.. సంక్రాంతి సెల‌వుల త‌ర్వాత తిరిగి స్కూళ్లు, విద్యా సంస్థ‌లు ప్రారంభం కావాల్సి ఉన్నా.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. ఈనెల 30వ తేదీ వ‌ర‌కు విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు పొడిగించిన విష‌యం తెలిసిందే. దీంతో.. ప్రైవేట్ విద్యా సంస్థ‌లు ఆన్‌లైన్ లో తిరిగి బోధ‌న‌ను ప్రారంభించాయి. ఇప్ప‌టికే రేప‌టి స‌ర్వేకు సంబంధించిన‌ టెస్ట్ కిట్ల‌ను, మెడిక‌ల్ కిట్ల‌ను ఆయా ప్రాంతాల‌కు అధికారులు చేర‌వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement