Tuesday, November 26, 2024

పేలిన నాటు బాంబు.. రెండు చేతులు పోగొట్టుకున్న గ్యాంగ్ స్ట‌ర్

ఓ క‌రుడుగ‌ట్టిన నేర‌స్థుడు నాటు బాంబు త‌యారు చేస్తుండ‌గా పేలింది. దాంతో ఓ గ్యాంగ్ స్థ‌ర్ త‌న రెండు చేతులు పోగొట్టుకున్నాడు. కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడులోని చెన్నైలో జరిగిందీ ఘటన. చెన్నైకి చెందిన ఒట్టెరి కార్తీ.. ఓ కరుడుగట్టిన నేరస్థుడు. పుఝల్ జైలులో విజయ్ కుమార్ అనే వ్యక్తితో కార్తికి పరిచయం ఏర్పడింది. రెండు రోజుల క్రితం అంబత్తూర్ లోని ఒరగడాం సమీపంలో కుక్కపిల్లను కొనుగోలు చేస్తానంటూ విజయకుమార్‌ వద్దకు వచ్చాడు. విజయ్ కుమార్ ఇంటిపై నాటు బాంబు చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో బాంబు పేలిందని పోలీసులు వెల్లడించారు. పేలుడు ధాటికి చేతులు పూర్తిగా ఛిద్రమయ్యాయి. దీంతో వాటిని తీసేయనున్నారు. ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చావుబతుకుల్లో కార్తి చికిత్స పొందుతున్నాడు. అసలు బాంబులు ఎందుకు తయారు చేస్తున్నారు..ఎక్కడ, ఎవరిపై ఉపయోగిస్తారు … తదితర వివరాలు తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement