Wednesday, November 20, 2024

రెండు మాస్కులు వేసుకుంటే మరింత రక్షణ

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు మరింత పెరుగుతుండటంతో కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకోవడానికి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రద్దీ ప్రదేశాల్లో రెండు మాస్కులు ధరిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మాస్కుపై మాస్కును ధరిస్తే కరోనా వైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గించవచ్చని, ఈ సలహా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని వారు పేర్కొన్నారు.

డబుల్ మాస్క్ విధానంలో ఒక సర్జికల్ మాస్కు, ఒక క్లాత్ మాస్కు లేదా రెండు క్లాత్ మాస్కులు ధరించవచ్చని ఢిల్లీకి చెందిన డాక్టర్ రోమెల్ టికూ సూచించారు. కరోనా రోగులు దగ్గిన సమయంలో వారి తుంపరల నుంచి బయటపడాలంటే డబుల్ మాస్క్ ధరించడం తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కొందరు వైద్యులు మాత్రం డబుల్ మాస్క్ విధానం వల్ల ఒరిగేదేమీ లేదని చెప్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement