– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ
లైంగిక వ్యాధుల (Sexual diseases)ను ఈజీగా తీసుకోవద్దంటున్నారు డాక్టర్లు. వీటిని అజాగ్రత్త చేయడం వల్ల మానసికంగా దెబ్బతినడమే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్యంపైనా ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఆడ, మగ అనే తేడాలేకుండా ఈ వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తాయని, రోజువారీ పనితీరులో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ మధ్య జరిపిన పరిశోధనలకు సంబంధించిన ఓ నివేదికను వైద్య నిపుణురాలు డాక్టర్ నుపూర్ గుప్తా వెల్లడించారు.
లైంగికంగా సంక్రమించే వ్యాధుల (Sexually transmitted diseases)కు తరచుగా యాంటీబయాటిక్స్ తో చికిత్స చేయవచ్చు. కానీ అది హెల్త్‌పైనా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇక.. అజాగ్రత్త కారణంగా చికిత్స చేయకపోతే ముఖ్యమైన, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావం ఎదురవుతుంది. దీంట్లో వంధ్యత్వం.. అంటే మొత్తానికే సెక్చువల్ లైఫ్ అనేది లేకుండా పోవచ్చు. అంతేకాకుండా ఇందులో గనేరియా -ప్రేరిత అంధత్వం వంటి అవయవ నష్టం కూడా ఉండవచ్చు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం.. ప్రతిరోజూ 1 మిలియన్ కంటే ఎక్కువ మంది Sexually transmitted infections (STI) తో ఇబ్బంది పడుతున్నారు. US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించిన వివరాల ప్రకారం.. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు సెక్చువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ (STD) నిర్ధారణలలో ఎక్కువగా ఉంటున్నారు. ఇది బహుశా ఈ వ్యాధి (STD) నివారణ గురించి వారిలో అవగాహన లేకపోవడమే ముఖ్య కారణం కావచ్చు. ఇక.. వారిలో ప్రమాదకరమైన లైంగిక ప్రవృత్తి కారణం కూడా కావచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
కాగా, ఈ డేటాను పరిశీలించినప్పుడు.. లైంగిక వ్యాధులు అనేవి (STD) వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాప్తి చెందుతాయని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. లైంగికంగా చురుకుగా ఉన్న ఎవరైనా ఈ వ్యాధుల (STD) బారిన పడే అవకాశం ఉందని చెబుతుననారు గుర్గావ్‌లోని ఫోర్టిస్ ప్రసూతి, గైనకాలజీ డైరెక్టర్ డాక్టర్ నూపుర్ గుప్తా. ముఖ్యంగా ఇది చిన్న వయస్సు గల వ్యక్తులలో ఎక్కువగా కనిపిస్తుందని తెలిపారు. స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్ అనేది హెర్పెస్, Human papilloma Virus (HPV)తో సహా అనేక STDలకు ప్రసార మార్గంగా ఉంటుందన్నారు.
లైంగిక వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రధానంగా కండోమ్‌లను ఉపయోగించాలని డాక్టర్ నుపూర్ గుప్తా చెబుతున్నారు. అంతేకాకుండా అప్పుడప్పుడు వైద్య పరీక్షలు కూడా చేయించుకోవాలని, ప్రత్యేకించి ఒకరికంటే ఎక్కువ మందితో సెక్చువల్ రిలేషన్ ఉంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక.. ఏదైనా లైంగిక వ్యాధి ఉందని అనుకుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని తెలిపారు.
ప్రస్తుత పోకడల ప్రకారం.. చాలా మంది తమ లైంగిక కార్యకలాపాలను ఎక్కువ మందితో కలిగి ఉంటున్నారు. ఇందులో ఒక వ్యక్తికి లైంగిక వ్యాధి ఉంటే.. అది వెంటనే ఇతరులకు సంక్రమించే అవకాశం ఎక్కువ స్థాయిలో ఉంటుంది. అందువల్ల తక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉండటం వలన ఇట్లాంటి వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది. సుఖ వ్యాధులు సంక్రమించే ప్రమాదాన్ని తగ్గించుకోవాలనుకుంటే లైంగిక భాగస్వాముల సంఖ్య కంటే ఎక్కువ ప్రొటెక్షన్ తీసుకోవడం మంచిది అని డాక్టర్ గుప్తా తెలిపారు.
ఒకవేళ తెలియకుండానే లైంగిక వ్యాధికి గురి కావచ్చు.. ఎందుకంటే చాలామంది కండోమ్స్ వంటివి వాడకుండా సెక్స్‌లో పాల్గొంటుంటారు. ఎక్కువ సమయం సురక్షిత రహితంగా ఉండడం వల్ల సుఖ వ్యాధులు రావడం తప్పదు. అందుకని సెక్స్ లో పాల్గొనే ముందు రిలేషన్లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితి.. వారి హెల్త్ ఎట్లుందనే విషయాలను చర్చించడం చాలా ముఖ్యం. మీకు లేదా జీవిత భాగస్వామికి లైంగిక వ్యాధి సోకిందో లేదో తెలుసుకోవడానికి ఇద్దరూ మెడికల్ టెస్ట్ చేసుకోవడం ఇంకా మంచిది.
పాపిల్లోమావైరస్ లేదా HPV సంక్రమణ జరగకుండా ఉండాలంటే.. దీని నివారణకు సాధారణ రోగనిరోధకత అవసరం. దీని నుంచి రక్షణకు HPV టీకా 11, 12 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి (లేదా 9 సంవత్సరాల వయస్సు నుండి ప్రారంభించవచ్చు) 26 సంవత్సరాల వయస్సు వరకు ప్రతి ఒక్కరికీ వేయవచ్చు. Human papilloma Virus (HPV) టీకాలు రోగులలో గర్భాశయ కేన్సర్‌లను నిరోధించడంలో కూడా ఉపయోగకరంగా ఉంటాయి.