Saturday, November 23, 2024

Spl Story: హైకమాండ్​ని ధిక్కరించిన లీడర్లు.. ఆజాద్​, సిబల్​ రాజీనామాలతో ‘జీ23’ విచ్ఛిన్నం!

కాంగ్రెస్​ సీనియర్​ నేత, 50 ఏళ్ల కాలంగా పార్టీని అంటిపెట్టుకుని ఉంటున్న లీడర్​ గులాం నబీ ఆజాద్​ ఇవ్వాల (శుక్రవారం) బయటికి రావడం ఆ పార్టీ వర్గాలను షాక్​కి గురిచేసింది. “గ్రూప్ ఆఫ్ 23” (జి-23) లీడర్లలో ఒకరిగా ఆజాద్​ ఉన్నారు. సమిష్టి, సమ్మిళిత నాయకత్వం కోసం రెండేండ్లుగా ఆయన పోరాటం చేస్తూ వచ్చారు. రెండేండ్ల క్రితం పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ కూడా రాశారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఉన్న లోపాలను ఆ లేఖ ద్వారా బయటపెట్టారు. అయితే.. హైకమాండ్​ని ధిక్కరించిన లీడర్లలో కీలక వ్యక్తులు ఇప్పుడు ఆ పార్టీని వీడారు. గులాంనబీ ఆజాద్​, కపిల్​ సిబల్​ రాజీనామాలతో జీ23 కంప్లీట్​గా విచ్ఛిన్నం అయ్యిందనే చెప్పవచ్చు.

–  డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

2020, ఆగస్టు 24న కాంగ్రెస్​ పార్టీకి చెందిన కొంతమంది సీనియర్​ లీడర్లు హైకమాండ్​కి రాసిన లేఖ పబ్లిక్‌లోకి వచ్చింది. ఆ తర్వాత పార్టీ విధేయులతోటి తిట్లు, దూషణలు ఎదుర్కొన్నారు G-23 సభ్యులు. రెండేళ్లుగా పోరాటం చేస్తూ వచ్చిన ఆజాద్, కపిల్ సిబల్‌ రాజీనామాలతో దాదాపుగా జి23 విచ్ఛిన్నమైందని చెప్పవచ్చు. ఇక.. అప్పట్లో పార్టీ పెద్దలకు, వీరికి మధ్య సర్దుబాటు చేయడానికి, శశి థరూర్, ఎం వీరప్ప మొయిలీ, ముకుల్ వాస్నిక్ వంటి లీడర్లు చొరవతీసుకుని హై-కమాండ్‌తో ఒప్పించారు. ఆ తర్వాత జితిన్ ప్రసాద, యోగానంద శాస్త్రి వంటి నాయకులు కూడా కాంగ్రెస్‌ను విడిచిపెట్టి భారతీయ జనతా పార్టీ (బిజెపి), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)లో చేరారు. ప్రసాద ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండగా, శాస్త్రి NCP ఢిల్లీ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు.

ఇక.. హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజుల ముందు హిమాచల్ ప్రదేశ్‌ పార్టీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి కేంద్ర మాజీ మంత్రి ఆనందశర్మ రాజీనామా చేశారు. ఇటీవల గందరగోళం సృష్టించిన వారిలో ఆయన ఒకరుగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ విధేయతను చాటుకోవడం ద్వారా తన మార్గాలను చక్కదిద్దుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే.. ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి మనమందరం కలిసి పనిచేయడం కూడా చాలా అవసరం అని శర్మ అన్నారు. తాను జీవితకాల కాంగ్రెస్‌వాదిగా మిగిలిపోయానని ఆ తర్వాత పునరుద్ఘాటించారు.

రెండేళ్ల క్రితం కాంగ్రెస్ చీఫ్‌కు పంపిన లేఖపై ఇతర సంతకాలు చేసిన వారిలో భూపిందర్ సింగ్ హుడా, పృథ్వీరాజ్ చవాన్, మనీష్ తివారీ, మిలింద్ దేవరా, రాజిందర్ కౌర్ భట్టల్, వివేక్ తంఖా, రేణుకా చౌదరి, పీజే కురియన్, రాజ్ బబ్బర్, కుల్దీప్ శర్మ, అఖిలేష్ ప్రసాద్ సింగ్, అరవిందర్ సింగ్ లవ్లీ, కౌల్ సింగ్ ఠాకూర్, అజయ్ సింగ్, సందీప్ దీక్షిత్​ వంటి వారున్నారు.

- Advertisement -

హర్యానా కాంగ్రెస్‌లో రాజకీయ స్థలాన్ని వదులుకోవడానికి ఇష్టపడని హుడా, ఇటీవల తన విధేయుడైన ఉదయ్ భాన్‌ను పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించడంలో విజయం సాధించారు. సోనియా గాంధీకి రాసిన వారి లేఖ పబ్లిక్‌గా మారిన తర్వాత G-23 కార్యకలాపాలపై పెద్దగా ఆసక్తి చూపని వాస్నిక్‌ను కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్-2024లో సభ్యునిగా చేసి, ఆ తర్వాత రాజ్యసభ బెర్త్ ఇచ్చారు.

పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్‌కు చెందిన లోక్‌సభ సభ్యుడు తివారీ చాలా కాలంగా ఒంటరిగా ఉంటూనే వస్తున్నారు. తరచుగా కీలక సమస్యలపై అధికారిక కాంగ్రెస్ దృక్కోణం నుండి భిన్నమైన వైఖరిని తీసుకుంటున్నారు. ఇక.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు దీక్షిత్, ఆజాద్ రాజీనామా లేఖకు పదునైన రీ పోస్ట్ చేశారు. G-23 చర్య “సంస్కరణల బ్యానర్, తిరుగుబాటు బ్యానర్ కాదు” అని గుర్తు చేశారు. వీరప్ప మొయిలీ గత సంవత్సరం జి-23 నుండి విడదీయగా.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే అయిన చవాన్ మహారాష్ట్ర కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement