ఇండియా, మాల్దీవుల మధ్య ఎక్సర్సయిజ్ ఎకువెరిన్ 11వ ఎడిషన్ ఈ నెల 6 నుంచి 19 మధ్య తేదీల్లో జరుగుతోంది. మాల్దీవుల్లోని కద్దూ ద్వీపంలో ఈ ఎక్సర్సయి్ ఎకువెరిన్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎకువెరిన్ అంటే స్నేహితులు అని అర్థం. ఇండియా, మాల్దీవుల మధ్య 2009 నుంచి కొనసాగుతున్న జాయింట్ మిలిటరీ ఎక్సర్సయిజ్ ఇది. ఒకసారి ఇండియా వేదికగా జరిగితే మరోసారి మాల్దీవుల్లో ఎక్సర్సయిజ్ జరుగుతుంటుంది.
10వ ఎడిషన్ మహారాష్ట్రలో జరిగింది. భూమిపై, నీటిలో టెర్రరరిజం.. దాన్ని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆపరేషన్ల గురించి రెండు దేశాలు ఈ ఎక్సర్సయిజ్ ద్వారా అవగాహన పెంపొందించుకుంటాయి. మిలటరీలో మెలుకువలను పంచుకుంటాయి. ఇండియా, శ్రీలంక, మాల్దీవుల మధ్య ఎక్సర్పయిజ్ దోస్తీ జరుగుతుంది. కాగా, ఇది రెండేళ్లకోసారి జరిగే కోస్ట్‌గార్డ్ ఎక్సర్సయిజ్.