Tuesday, September 17, 2024

Exclusivi – రామసేతు నిజం నిజం

ఇస్రో నిర్ధారణ.. 10 మీటర్ల మ్యాప్ విడుదల
అమెరికా శాటిలైట్ ఐశాట్ 2 సహకారం
జైపూర్, హైదరాబాద్ ఇస్రోల కృషి
ఆరేళ్ల పరిశోధన ఫలితం
జలమార్గంపై రామభక్తుల అభ్యంతరం
ఇక సముద్ర గర్భ రైలు మార్గమే ఆమోద యోగ్యం
ఇక హేతువాదనలకు బ్రేక్

వంద యోజనాల (800 మైళ్ల) దూరంలోని లంకపైకి హనుమంతుడు దూకింది నిజం. వానర సైన్యంతో రాముడు వారధి కట్టింది నిజం…లంకలో రావణాసురిడిని సంహరించింది నిజం…సీతను కాపాడింది నిజం. ఈ పురాణగాథ కేవలం కథ కాదు. పచ్చి నిజం అని భారత రోదపి ప్రయోగ సంస్థ (ఇస్రో) స్పష్టం చేసింది. ఎన్నో ఏళ్లుగా వివాదస్పద నిర్మాణం న్న రామసేతు పై కీలక ఆధారాలు లభించాయి. రామేశ్వరం .. మన్నార్ వారధి మాట వాస్తవమేననిఆధారాలను ఇస్రో కచ్చిత సమాచారాన్ని సేకరించింది. అమెరికకు చెందిన నాసశాట్‌లైట్‌ ఆధారంగా రామసేతుకీలక ఛాయా చిత్రాలను సేకరించింది.

( ఆంధ్ర ప్రభ స్మార్ట్, హైదరాబాద్ ప్రతినిధి) రాముడు వానరసేనను వెంటపెట్టుకుని లంకకు చేరుకుని రావణుడిని ఓడించి సీతమ్మను చెరవిడిపించాడని పురాణాలు చెబుతున్నాయి. రాముడు మానవుడే కాబట్టి సముద్రాన్ని దాటలేడని…వానర సైన్యం పెద్దపెద్ద బండరాళ్లతో వారధి నిర్మించటం అసాధ్యమని నాస్తికుల వాదన తెలిసిందే. కానీ రామాయణం ఊహా జనం కాదు.. అది వాస్తవ దృశ్యం అని ఆధారాలు నిరూపిస్తున్నాయి. ప్రస్తుతం జనం పిలిచే ఆడమ్‌బ్రిడ్జి రామసేతు నిర్మాణమేనట. ఇన్ని యుగాలైనప్పటికీ ఇప్పటికీ ఈ నిర్మాణం మనకు కనిపిస్తోంది. భారత్‌, శ్రీలంకమధ్య 29 కిలోమీటర్ల మేర ఈ వారధిపై రకరకాల వాదనలు ఉన్నాయి. అదంతా కల్పితగాథ అని కొందరు..లేదు నిజంగానే అదే రామసేతు నిర్మాణమని కొందరు వాదన. వాస్తవానికి క్రీస్తు శకం 1480 వరకూ ఈ రామసేత జాడే లేదు. పకృతి వైపరీత్యాల నేపథ్యంలో 15 వ శతాబ్ధంలో ఈ వారధి బయట పడింది. ఇప్పటికీ ఈ వారధిపై కాలిబాటలో రామేశ్వరం నుంచి మన్నార్ వరకూ జనం నడుస్తున్నారు.

- Advertisement -

ఇస్రో పరిశోధన పలితం

ఎట్టకేలకు ఈ వివాదాన్ని తెరదించుతూ..భారత అంతరికక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక ప్రకటన చేసింది. అమెరికానాసా పరిశోధన సంస్థ సాయంతో రామసేతు కీలక ఫొటోలు విడుదల చేసింది. ఇస్రో రూపొందించిన 10 మీటర్ల మ్యాప్‌లో వంతెన మొత్తం కనిపిస్తోంది. అమెరికాఉపగ్రహం ఐస్‌శాట్‌- -2 ద్వారా ఈ వంతెనను కనుగొన్నారు..ఆరేళ్ల కిందటే రామసేతు వారధి డేటాను 2018 అక్టోబర్ నుంచి 2023 అక్టోబర్‌కు వరకూ సేకరించారు. జోధ్‌పూర్, హైదరాబాద్‌ ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఫలించింది. ఇరుదేశాల మధ్య ఈ వంతెన పొడవు దాదాపు 29 కిలోమీటర్లుగా తేల్చారు.సముద్ర గర్భం నుంచి దాదాపు 8 మీటర్ల ఎత్తు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ రామసేతు 99.98 శాతం నీటిలోనే మునిగిపోయి ఉందని మిగిలిన కొద్దిప్రాంతం మాత్రమే బయటకు కనిపిస్తోందని తెలిపారు. ఈ నిర్మాణం తమిళనాడులోని రామేశ్వరంసమీపంలోని ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని మన్నారు ద్వీపం తలైమన్నారు వరకు వ్యాపించి ఉన్నట్లు గుర్తించారు.పెద్దపెద్ద రాళ్లు, సున్నం ఉపయోగించి ఈ రామసేతు నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది.

ఫలించిన శ్రమ ..

రామసేతి వారధి నిర్మాణానికి వానర సైన్యం ఎంతగా శ్రమించిందో.. ఊహించలేం. కానీ ఈ నిర్మాణం అసలు కథను వెల్లడించటానికి ఎందుకంటే.. సాక్షాత్తు శ్రీరాముడు నడిచిన మార్గం కావడంతో ఈ వంతెన భారత్‌కు ఎంతో సెంట్‌మెంట్‌తో ముడిపడని అంశం. అందుకే ఏళ్లతరబడి దీని జాడ కనుగొనేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది. ఇంతకు ముందు జరిపిన పరిశోధనల్లో ఈ వంతెనకు సంబంధించిన బయటకు కనిపించే భాగాలపైనే పరిశోధన జరిపారు. ఇప్పుడు తొలిసారి అమెరికాకు చెందిన నాసా సాయంతో సముద్రగర్భంలో మునిగిపోయి ఉన్న వంతెనకు సంబంధించిన వివరాలను ఐస్‌శాట్‌ శాటిలైట్ సాయంతో కనుగొన్నారు. అధునాతన లేజర్ టెక్నాలజీతో అత్యంత ఖచ్చితమైన ఫొటోలు సంపాదించారు. రామేశ్వరంలోని ఆలయ రికార్డుల ప్రకారం ఈ వంతెన 1480 వరకు సముద్రమట్టానికి పైనే ఉందని…ఆ తర్వాత తుఫాన్‌ల కారణంగా ధ్వంసమైనట్లు తెలిసింది.

జలరవాణాకు కీలకమార్గం

జలరవాణాకు అత్యంత కీలకం పాక్‌జలసంధి ఉన్న ప్రాంతంలోనే రామసేతు నిర్మాణం ఉంది. అంత్యంత ఇరుకుగా ఉన్న ఈ జలరవాణా మార్గాన్ని పెంచాలని..పెద్దపెద్ద ఓడలు తిరిగేలా వెడల్పుచేయాలని భావిస్తుండగా…పలు ధార్మిక సంఘాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. రామసేతు నిర్మాణానికి ఎలాంటి భంగ వాటిల్లినా సహించేది లేదని హెచ్చరిస్తున్నాయి. ఈ స్థితిలో సముద్ర గర్భ రైలు మార్గమూ తెరమీదకు వచ్చింది. ఇప్పటి వరకూ.. రామసేతు నిర్మాణమే లేదని..అదోక ఊహజనిత ప్రచారమని కొట్టిపారేస్తున్న హేతువాదులకు ఈ మ్యాప్ సరైన సమాధానం చెబుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement