Tuesday, November 26, 2024

Exclusive – చంద్ర‌యాన్ 3 ప్ర‌యోగంతో ప్ర‌పంచం చూపు మ‌న‌వైపు…..

అంతరిక్షంపై ఆధిపత్యం కోసం పోరాటం మొదలైంది. అగ్రదేశాలు భారీ వ్యయంతో అంతరి క్ష రహస్యాల్ని తమ గుప్పెట పట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఒకదానిపై ఒకటి పోటీలు పడుతున్నాయి. ముఖ్యంగా అంగారకుడు, చంద్రుడిపై మానవ నివాసయోగ్య వాతావరణాన్ని అన్వేషించేందుకు ప్రాకులాడుతున్నాయి. ఇందుకోసం కొన్ని దశాబ్ధాల క్రితమే అంతరిక్షణ శోధన మొదలైంది. ఇప్పుడిది వ్యాపార దృక్పధంగా మారింది. చంద్రుడిపై నివాసయోగ్య ప్రాంతాల అన్వేషణ కోసం కొన్ని దేశాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాజాగా రష్యా ప్రయోగం కూడా విజయం కాలేదు. ఈ దశలో ప్రపంచం మొత్తం ఆగస్టు 23వ తేదీ సాయంత్రం కోసం ఎదురుచూస్తోంది.

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – చంద్రుడి రహస్యాల్ని ఛేదించేందుకు భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌ 3 ప్రయాణం తుది దశకు చేరుకుంది. బుధవారం సాయంత్రం విక్రమ్‌ ల్యాం డర్‌ చంద్రుడిపై ల్యాండ్‌ కానుంది. ఇప్పటికే ప్రొప ల్‌షన్‌ మాడ్యూల్‌ నుంచి విడివడ్డ విక్రమ్‌ ల్యాండర్‌ అందు లోని ప్రజ్ఞాన్‌ రోవర్‌లు చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తు న్నాయి. విక్రమ్‌ను సాఫీగా చంద్రుడి దక్షిణదృవ ఉపరితలంపై ల్యాండ్‌ చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తమ పరిజ్ఞానాన్నంతా వినియో గిస్తున్నారు. చంద్ర యాన్‌ 2లో జరిగిన చిన్నపాటి పొరపాట్లు పునరావృ తం కాకుండా ముందే జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా చంద్రయాన్‌ 2 ప్రయోగంలో భాగంగా పంపిన ఆర్బిటర్‌ చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ విక్రమ్‌ ల్యాండర్‌ సేఫ్టీ ల్యాం డింగ్‌కు అనువైన ప్రదేశానికి సంబంధించి ఫోటోలు, సమాచారాన్ని చేరవేస్తోంది. అలాగే చంద్రయాన్‌ 2 ఆర్బిటర్‌, చంద్రయాన్‌ 3 ల్యాండర్‌ మాడ్యుల్‌తో ఇప్పటికే అనుసంధానమైంది. ఈ రెండింటి మధ్య పరస్పర సమాచార మార్పిడి జరుగుతోంది. పరిస్థితులన్నీ సానుకూలమై విక్రమ్‌ను చంద్రుడి దక్షిణ దృవ ఉపరితలంపై సేఫ్‌ ల్యాండింగ్‌ పూర్తయిన పక్షంలో అంతరిక్షంపై ఆధిపత్యం కోసం సాగుతున్న పోటీలో భారత్‌ కూడా ఓ ప్రధానపాత్ర పోషించే అవకాశాలుంటాయి.

ఈ ప్రయోగంతో చంద్రుడిపై నీటిజాడల అన్వేషణ జరగనుంది. ఇప్పటికే అమెరికా, రష్యా వంటి అగ్రదేశాలు దశాబ్ధాలుగా ఇందుకోసం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు. చంద్రుడి ఉత్తర దృవప్రాంతంపైనే ఇప్పటి వరకు పలు దేశాలు పంపిన ల్యాండర్లు దిగాయి. తొలిసారిగా దక్షిణదృవ ప్రాంతాన్ని భారత్‌ ఎంచుకుంది. ఇక్కడ మైనస్‌ 230డిగ్రీల సెల్సియస్‌ ఉంటుంది. సహజంగా నే ఇటువంటి ప్రాంతంలో ఘనీభవించిన నీటి పరిమా ణం అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పట్టుకుని చంద్రుడి దక్షిణ దృవానికి సుమారు 650కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్‌ 3 ల్యాండర్‌, రోవర్లు దిగుతా యి. ఇవి చంద్రుడి ఉపరితలాన్ని పరిశోధిస్తాయి. అలాగే చంద్రుడిపై మారుతున్న వాతావరణాలు, పగలు, రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు పరిశీ లిస్తాయి. వీటితో పాటు చంద్రుడి ఉపతలంపై గల మట్టిలో మూలకాలు, వాతావరణంలోని వాయువులు, విద్యు త్‌ అయస్కాంత కణాలపై కూడా పరిశోధన చేస్తాయి. చంద్రుడిపై తరచూ ఏర్పడుతున్న భూకంపాలకు కారణాల్ని అన్వేషిస్తాయి. అంతరిక్షంపై భారత్‌ పై చేయి సాధిస్తుందన్న భయం తో రష్యా హడావిడిగా రూపొందించిన లూనా 25 ఘోరంగా విఫలమైంది. భారత్‌ చంద్రయాన్‌ 3కి మొత్తం 650కోట్లు ఖర్చు చేసింది. సుదీర్ఘ సురక్షిత ప్రయాణంతో జాబిల్లిపై విక్రమ్‌ను ల్యాండ్‌ చేయాలని ప్రతిపాదించింది. కానీ రష్యా రూ. 1600కోట్ల ఖర్చుతో అత్యంత వేగంగా లూనా 25ని ప్రయోగిం చింది. దీన్ని ఆగస్టు 11న ప్రయోగిస్తే ఆగస్టు 21నాటికి కేవలం పదిరోజుల్లోనే చంద్రుడి దక్షిణ దృవప్రాం తంలో దింపి తొలిసారిగా ఆ ప్రాంతంపై అధ్యయన యంత్రాల్ని పంపిన ఘనత తమదేనని చాటుకునేం దుకు ఉబలాటపడింది.

కానీ ఈ ప్రక్రియలో రష్యా ఘోర వైఫల్యం చెందింది. చంద్రుడి దక్షిణ దృవ ఉపరితలా నికి కొన్ని అడుగుల దూరంలోనే లూనా 25విఫలమైం ది. రోబో ల్యాండర్‌ తన పరిధినుంచి వేరుపడింది. మరో కక్ష్యలో ప్రవేశించింది. వేగంగా చంద్రుడి ఉపరి తల ంపైకి జారిపోయింది. బలంగా ఢీ కొట్టింది. దీంతో లూనా 25 ప్రయోగం విఫలమైంది. అప్పట్నుంచి చంద్రయాన్‌ 3పై ప్రపంచ వ్యాప్తంగా ఉత్సుకత మరింతగా పెరిగింది. రోదశిలో ఇప్పటికే ప్రపంచ దేశాల సరసన నిల్చిన భారత్‌ బుధవారం సాయంత్రానికి చంద్రుడి దక్షిణదృవ ప్రాంత ఉపరిత లంపై ల్యాండర్‌ను సునాయాసంగా సురక్షితంగా దింపిన ఘనతతో అంతర్జాతీయంగా తన ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసుకోనుంది. ఇప్పటికే చంద్ర యాన్‌ 1 పంపిన మూన్‌ ఇంపాక్ట్‌ ప్రోగ్‌ ద్వారా పలు అంశాల్ని భారత్‌ అధ్యయనం చేసింది. చంద్రయాన్‌ 2 విఫలమైనప్పటికీ ఆర్బిటర్‌ తనకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేస్తోంది. చంద్రయాన్‌ 3తో భారత్‌ రోదశిలో మువ్వన్నెల జెండాను ఎగురవేయనుంది. చంద్రుడిపై కాలుమోపి పరిశోధనలు చేయాలన్న ఆకాంక్ష ఈనాటిదికాదు. 60వ దశకంలోనే ఇందుకు బీజం పడింది. 1969లో అమెరికా వ్యోమగాములు చంద్రుడిపై కాలుమోపారు. ఆ తర్వాత సుమారు 111ప్రయోగాలు జరిగాయి. వీటిలో కొన్ని మాత్రమే విజయవంతమయ్యాయి. ఇప్పుడు దేశాలే కాదు.. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా రోదశి ప్రయోగాలు చేప ట్టాయి. భవిష్యత్‌లో అంతరిక్ష పరిశోధనలకు, అంత రిక్షయాత్రలకు చంద్రుడ్ని గీటురాయిగా మలుచుకో వాలన్నది ప్రపంచ శాస్త్రవేత్తల లక్ష్యం. అలాగే చంద్రు డిపై ఆవాసాలను రూపొందించుకోవాలన్న ఆసక్తి కూడా పలు దేశాల్లో వ్యక్తమౌతోంది. కొందరైతే చంద్రు డ్ని యాత్రా స్థలంగా మార్చాలని, ఈ టూరిజం ద్వారా పెద్దెత్తున వ్యాపారం చేసేందు క్కూడా సిద్దమౌతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement