Wednesday, November 27, 2024

Exclusive తెలంగాణ‌కు ఫ్యూచర్​ ప్లాన్​ – హైద‌రాబాద్ – 2050 టార్గెట్​

రేవంత్​ సర్కార్ వేగ‌వంత‌మైన అడుగులు
మాస్టర్​ప్లాన్​ రూపొందిస్తున్న ప్రభుత్వం
పాతికేళ్ల అవసరాలకు తగ్గట్టు చర్యలు
హైదరాబాద్‌ దిశ మార్చేలా ఆలోచనలు
రాజీవ్​ రహదారిపై ఎలివేటెడ్​ కారిడార్లు
హైవేల‌లో డబుల్​ డెక్కర్​ ఎలివేటెడ్​ కారిడార్​
మెహిదీపట్నం వద్ద స్కైవాక్​ నిర్మాణం.. పర్మిషన్​ ఇచ్చిన రక్షణశాఖ
మెట్రో రెండోదశ పనులకు ఆమోదం
జీహెచ్​ఎంసీ పరిధిలో మెరుగైన రోడ్లు
కనీవినీ ఎరుగని రీతిలో ఫ్యూచర్​ సిటీ నిర్మాణం
మూసీ పునరుజ్జీవానికి వేగవంతంగా చర్యలు
హైద‌రాబాద్ సిటీకి 20 టీఎంసీల గోదారి జ‌లాలు
గాంధీ ఐడియాల‌జీకి అనుగుణంగా బాపూఘాట్‌
ఏడాది ప్ర‌జా పాల‌న‌.. ప్ర‌గ‌తి ప‌థంలో తెలంగాణ‌

ఆంధ్రప్రభ స్మార్ట్​, తెలంగాణ:
తెలంగాణ అభివృద్ధిని స్పీడ‌ప్ చేసేందుకు రేవంత్ హ‌యాంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం వేగ‌వంత‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హైద‌రాబాద్ 2050 పేరిట మాస్ట‌ర్ ప్లాన్ రూపొందిస్తోంది. ముఖ్యంగా హైద‌రాబాద్ నగరంలో ట్రాఫిక్‌ సమస్యలను తొలగించేందుకు ₹2,232 కోట్లతో రాజీవ్‌ రహదారిపై ఎలివేటెడ్‌ కారిడార్, ₹1,580 కోట్లతో నాగ్‌పుర్‌ నేషనల్ హైవేపై డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణాలకు సీఎం రేవంత్‌ భూమిపూజ చేశారు. ముఖ్యంగా మెహిదీపట్నం వద్ద స్కైవాక్‌ నిర్మాణానికి రక్షణ శాఖ పర్మిషన్ తెప్పించడం పెద్ద విజయంగా సీఎంవో పేర్కొంది.

మెట్రో రెండో దశకు ఆమోదం..

₹24,237 కోట్లతో మెట్రో సెకండ్​ పేజ్​ పనులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నగరం చుట్టూ ₹18 వేల కోట్లతో ఆర్‌ఆర్‌ఆర్‌ (ఔటర్​ రింగ్​ రోడ్డు) నిర్మించనున్నారు. హెచ్‌సీఐటీఐ ప్రాజెక్టులో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో రోడ్ల నిర్మాణానికి ₹8,996 కోట్లతో ప్రపోజల్స్ సిద్ధంచేసి ₹596 కోట్ల అంచనాలతో వరదనీటి కాల్వలను, కూడళ్లలో వర్షపు నీరు నిలవకుండా భూగర్భబావులను ఏర్పాటు చేస్తున్నారు. కేబీఆర్‌ పార్కు చుట్టూ ₹826 కోట్లతో ఆరు జంక్షన్లను డెవలప్​మెంట్​ చేయనున్నారు. ₹360 కోట్లతో మీరాలం చెరువు వద్ద 4 లేన్ల ఫ్లైఓవర్​ నిర్మిస్తున్నారు.

ఫ్చూచ‌ర్ సిటీ నిర్మాణం.. మరెన్నో కొత్త ప్రాజెక్టులు..

- Advertisement -

30,000 ఎకరాల్లో ఫ్యూచర్‌సిటీ నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఫార్మాసిటీతోపాటు ఏఐ నగరం, సాఫ్ట్‌వేర్, లైఫ్‌సైన్సెస్, హెల్త్‌కేర్‌ టెక్నాలజీ వంటి అధునాతన టెక్నాలజీ పరిశ్రమల కేంద్రంగా ఫ్యూచర్‌ సిటీని తీర్చిదిద్దబోతున్నారు. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ వర్సిటీకి ఇప్పటికే శంకుస్థాపన చేయగా త్వరలోనే క్రీడా యూనివర్సిటిని నెలకొల్పబోతున్నారు.

మూసీ పునరుజ్జీవం.. చెరువుల పరిరక్షణ..

హైదరాబాద్‌లో చెరువులు, నాళాలు, గవర్నమెంట్​ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు చేయ‌డం అన్ని వ‌ర్గాల్లో సంతోషం వ్య‌క్తం అయ్యింది. అదే విధంగా మూసీ పునరుజ్జీవంతోపాటు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రతిపాదనలు రెడీ చేశారు. మూసీలోకి చేరుతున్న మురుగును కంప్లీట్​గా శుభ్రం చేసేందుకు కొత్తగా 39 ఎస్‌టీపీలను ఏర్పాటు చేయబోతున్నారు. ఎల్లంపల్లి నుంచి 20 టీఎంసీల నీటిని తరలించి, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలు తీర్చేలా భారీ ప్రణాళికలు చేస్తున్నారు. బాపూఘాట్‌ను తీర్చిదిద్ది, గాంధీ ఐడియాలజీ సెంటర్​ను ఏర్పాటు చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement