Friday, November 22, 2024

Exclusive హలో మాస్టార్.. హార్ట్ మిస్ ఆయే… ఇది ఓ దిల్లీ విద్యార్థి గుండె ఘోష

“ టెస్ట్ కోసం రక్తాన్నిస్తే బ్లడ్ గ్రూప్,, ఏల్ఓవీఈ , ఓపెన్ చేసి హార్ట్ ని చూస్తే వాల్వ్ లోన ఏల్ఓవీఈ, నాడి ని పట్టి పల్స్ ని చూస్తే నరాలు పాడే ఏల్ఓవీఈ… హలో డాక్టర్ హార్ట్ మిస్ ఆయే.. 28 ఏళ్ల కిందట ప్రేమదేశం సినిమాలో ఈ పాట గుర్తుకొస్తే… ఆ పరీక్ష పత్రాన్ని దిద్దే మాస్టారు కూడా హృదయం ఎక్కడున్నాది.. హృదయం ఎక్కడున్నాది అనుకునే స్థితికి తీసుకు వచ్చిన… ఓ విద్యార్థి హృదయ ఘోష ఇది”


. దేశ రాజధాని దిల్లీలోని ఓ కాలేజీ పోరడి ప్రేమ కథ పురాణం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కాగా.. 10 లక్షల మంది నోళ్లు వెళ్లబెట్టారు. ఈ కథేందో చూదాం. దిల్లీలోని ఓ కాలేజీలో పరీక్షలు జరగుతున్నాయి. సదరు విద్యార్థికి ఓ ప్రశ్నాపత్రం చేతికి అందింది. ఏంటంటే.. “గుండె పని చేసే విధానాన్ని చిత్రం సహాయంతో వివరించుము?.. ఇక మనోడు ఎంతో శ్రద్ధతో ఆన్సర్ ఇచ్చాడు. చక్కని చిత్రం గీచాడు. గుండెను వర్ణించాడు. కుడి జఠరికకు పూజ, కుడి కర్ణికకు హరిత, ఎడమ జఠరికకు రూప, ఎడమ కర్ణికకు ప్రియ పేర్లు పెట్టాడు. ఆ భాగాల పని తీరు కూడా అభివర్ణించాడు.

- Advertisement -


ప్రియ ఎప్పుడూ ఇస్టాగ్రామ్ లో చాటింగ్ చేస్తుంది. నాకు ఎంతో ఇష్టం, రూపా ఎప్పుడూ స్నాప్ చాట్ లో పలకరిస్తుంది. వెరీ బ్యూటిపుల్ అండ్ క్యూట్ , ఇక నమిత పక్కింటి అమ్మాయి. కళ్లు పెద్దవి. పొడవైన జుట్టు. హరిత నా క్లాస్ మేట్. ఇక పూజా ఎక్స్ లవర్. ఆమెను మర్చిపోలేక పోతున్నా..అంటూ కన్నీటి బొమ్మ గీచాడు. అంతే పేపర్ దిద్దిన మాస్టార్ అవాక్కయ్యారు. అయ్యా… మీ అమ్మానాన్నను ఒక సారి కలవమను అని కామెంట్ రాసి.. జీరో మార్కులు వేశారు.


ఈ ఆన్సర్ షీట్ వైరల్ అవుతోంది. ఇక నెటిజన్లూ తమ కామెంట్లతో.. సరదా చేశారు. గుండెకు నాలుగు గదులున్నాయని తెలిసింది, పర్వాలేదు అని ఒకరు… మాజీ లవర్ కు గదిలేదు అని మరొకరు కామెంట్లు పెట్టారు. ఏంటో స్టూడెంటు, టీచర్ రైటింగ్ ఒకేలా ఉంది ? అని ఇంకొకరు కామెంట్ పెట్టారు. ఇదండి ఈ ప్రేమ దేశంలో ఓ ప్రేమికుడి గుండె గాథ.

Advertisement

తాజా వార్తలు

Advertisement