Saturday, November 16, 2024

Exclusive – అయిదు గ్రామాల విలీనంతోనే భ‌ద్రాద్రికి భ‌రోసా…

రామచంద్రుల భేటీలో… భద్రాద్రికి భరోసానివ్వాలి
తొలి అజెండాగా ఐదు గ్రామాల విలీనంపై చర్చించాలి
అధిక ప్రాధాన్యతాంశంగా చర్చించాలని భక్తుల వేడుకోలు
రోసారి తెరపైకి విభజన హామీలు.. విలీన గ్రామాల అంశం
భద్రాద్రి రాములోరి ఆలయ పురోభివద్ధికి అడుగులు వేయాలి
భద్రాచలం పట్టణ ఉద్దీపనచర్యలకు నడుం బిగించాలని విన్నపం

అలనాడు రాముడు నడయాడిన నేలగా చరిత్రకెక్కిన భద్రాచలం.. తెలుగు రాష్ట్రాల విభజనకు ముందు భక్తుల రాకపోకలతో కళకళలాడుతూ ఉండేది… తెలుగు రాష్ట్రాల విభజన నేపథ్యంలో ప్రస్తుతం భద్రాద్రి ఉనికికే ప్రమాదం ఏర్పడింది… ఈ నేపథ్యంలో విభజన చట్టం హామీల అమలు.. తక్షణ కర్తవ్యాలపై సమీక్షించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది… దీంతో భద్రాచలం పట్టణ ఉద్ధీపనకు అడుగులు వేయాలని.. ఆంధ్రాలో కలిసిన విలీన గ్రామాలను తెలంగాణాలో కలపాలని భక్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు…

న్యూస్‌ నెట్‌వర్క్‌ ఇన్‌చార్జి, ఆంధ్రప్రభ :


రాముడు నడయాడిన నేల, నరనారాయణుడిగా వైకుంఠ వాసుడు కొలువుతీరిన ప్రాంతమిది. అంతటి చరిత్ర గలిగిన భద్రాచలంలో శ్రీరామచంద్రుడు, సీతాలక్ష్మణ సమేతుడై కలియుగ కష్టాలను ఎదుర్కొంటున్నాడు. రామాయణం నాటి స్మృతులకు నిలయమైన భద్రా చలంలో భారతీయ చరిత్రలో ఆదర్శ పురుషునిగా ఘనతికెక్కిన రాముడు అరణ్యవాసం నాటి కష్టాలను ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల విభజనకు ముందు నిత్యకల్యాణం – పచ్చతోరణంగా విలసిల్లిన భద్రాద్రి ఉనికిని కోల్పోతోంది. భద్రాచలం మండలంలోని ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకల పాడు, పురుషోత్తమపట్నం, గుండాల గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంతో భద్రాద్రి మండలం ప్రభా వం పూర్తిగా కోల్పోయింది. భద్రాద్రి రామ య్యకు సంబంధించిన ఆస్తులన్నీ వి లీన గ్రామాల రూ పంలో ఆంధ్రాలో కలిసిపోగా, భద్రాచలం పట్టణం మాత్రమే మిగిలింది. టెంపుల్‌ సిటీగా అభివృద్ధి పరచి తీర్చిదిద్దు తామన్న గత పాలకులు, హామీలను విస్మ రించడంతో భద్రాచలంలో బతుకులీడటమే క్లిష్టంగా మారిందని ఇక్కడి వ్యాపారస్తులు సైతం వాపో తున్నారు.

ఆలయ అభివృద్ధికి అడుగులేయాలి
భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ అభి వృద్ధికి ఉభ య తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడు గులు వేయాలని రాములోరి భక్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఆర్థికంగా, మౌలిక వసతుల అభివృద్ధి పరంగా అవస్థలను ఎదుర్కొంటున్న భద్రాచల రామ య్య ఆలయానికి పూర్వవైభవం తీసుకు వచ్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు, ఉభయ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రులు అంకితం కావాలని వారు కోరు తున్నారు. ఇక్కడ జరిగే వార్షిక సీతారాముల కల్యాణం, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించాలని వారు విన్నవిస్తున్నారు. ఆలయ ఆస్తులను పరిరక్షించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

రామాయణం సర్క్యూట్‌ కోసం కృషి చేయాలి
అయోధ్య మొదలుకొని భద్రాచలం వరకు రామా యణం టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేసేలా తెలు గు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉమ్మడిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వం సైతం తెలు గు రాష్ట్రాల పట్ల సానుకూలధోరణి తో అడుగులు వేస్తున్న నేపథ్యంలో ప్రత్యేక చొరవచూపి, ఆలయ అభి వృ ద్ధికి కేంద్ర సహకారం తీసుకోవాలని రామయ్య భక్తులు కోరుతున్నారు. చరిత్రలో గుర్తుండి పోయేలా భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి పర చా లని, మాడ వీధుల విస్తరణ, మౌలిక వసతులను మెరు గుపర చ డం వంటి అంశాలను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చే యాలని భక్తులు కోరుతున్నారు. ఆంధ్రాలో విలీ నమై న ముంపు మండలాలను కలుపుతూ భద్రా చలం రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయాలని భక్తులు ఆకాం క్షిస్తున్నారు.

హాట్‌టాపిక్‌గా తుమ్మల లేఖ
ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఐదు గ్రామ పంచా యతీలపై చొరవ తీసుకోవాలంటూ సీఎం రేవంత్‌ రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు లేఖాస్త్రం సంధించడం హాట్‌ టాపిక్‌గా మా రింది. భద్రాచలం పట్టణం మినహా మిగతా గ్రామాలు ఆంధ్రాలో విలీనం కావడంతో భద్రాచలం పట్టణానికి డంపింగ్‌ యార్డ్‌ కూడా లేకుండా పోయిందని, అంతె కాకుండా సరిహద్దు సమస్యలతో ఇక్కడి ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారని తుమ్మల సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆంధ్రాలో కలిసిన ప్రాంతాల్లోని ఆలయ భూముల పర్యవేక్షణకు ఆలయ అధికారులకు పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవు తున్నాయని, స్థానిక ప్రజల ఇబ్బందులను, విజ్ఞాప నలను గమనంలోకి తీసుకొని ఇరువురు ముఖ్య మం త్రులు పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజల సంక్షేమం కోసం సముచితమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement