Monday, November 25, 2024

Exclusive – ఎన్డీయే వ్యూహం … 2027 జ‌మిలి….?

2026లో నియోజకవర్గాల పునర్విభజన
ఎన్డీయే వ్యూహరచన
చంద్రబాబు వ్యాఖ్యల సంకేతమిదే
ప్రజావెూదం కోసం పాలన పరుగులు
ప్రతిపక్ష పార్టీలు పోరుబాట
ఆసక్తికరంగా మారనున్న తెలుగు రాష్ట్రాల రాజకీయం

(న్యూస్‌ నెట్‌వర్క్‌ ఇన్‌చార్జ్‌)


హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ మొదలైంది. ఇందుకు ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు బలం చేకూరు స్తున్నాయి. రెండు రోజుల హస్తిన పర్యటన ముగించుకుని అమరావతి చేరిన వెంటనే మీడియా సమావేశం పెట్టి జమిలి ఎన్నికలకు మేము సిద్ధమంటూ చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే… కేంద్ర పెద్దలు స్పష్టమైన సంకేతాలు చంద్రబాబుకు ఇచ్చారని తెలుస్తోంది.

”వన్‌ నేషన్‌… వన్‌ ఎలక్షన్‌”కు తాము కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పదేపదే చెబుతుండగా, తాజాగా కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో జమిలి ఎన్నికలపై విస్తృతంగా చర్చించి ఆమోదం తెలిపారు. సాధ్యమైనంత త్వరగా జమిలి ఆలోచన చేస్తున్నట్లు చంద్రబాబు తనను కలిసిన సంద ర్భంగా ప్రధాని మోడీ చెప్పినట్లు తెలియవ చ్చింది. ఈ నేపథ్యం లో చంద్రబాబు ప్రకటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరుగనుంది.


ఈ పునర్విభజన ప్రక్రియకు ఎంతలేదన్నా 10-12 నెలల సమయం పడుతుందని అధికారవర్గాల అంచనా. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసి, ఆ వెనువెంటనే జమిలి ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ప్రధా నంగా తెలుగు రాష్ట్రాలలో రాజకీయ ముఖచిత్రం మారు తుందని రాజకీయ పరిశీలకులు యోచిస్తున్నారు.

- Advertisement -

పాలన పరుగులు
2027లో జమిలి ఎన్నికలొస్తే ప్రజామోదం పొంద డమె లా అనే అంశంపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. ఇక 26 నెలలే సమయముంది… జనంలోకి వెళ్లి ఓటర్లను మచ్చిక చేసుకోవడంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు సమాలోచనలు చేస్తున్నాయి. ప్రజామోదం పొందడం కోసం పాలక పక్షాలు పాలనను పరుగులు పెట్టిస్తున్నాయి. మేనిఫెస్టోలు, ఎన్నికల హామీల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే మాసాల్లో పార్లమెంట్‌కు పలు రాష్ట్రాల అసెంబ్లిd ఎన్నికలు జరిగాయి.

మూడు, నాలుగు మాసాల్లో ఎన్నికల హామీలపై దృష్టి సారించినప్పటికీ, పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకురాలేదు. తక్షణమే వాటిపై దృష్టి సారిం చాలని అటు కేంద్రంతోపాటు, ఇటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కార్యాచరణ రచిస్తోంది. సాధ్యమైనంత త్వరగా హామీలు అమలుతోపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుకు శ్రీకారం చుడుతున్నాయి. నవంబర్‌ 3న 16,347 ఉపా ధ్యాయ పోస్టుల భర్తీకి ‘మెగా డీఎస్సీ’ పేరుతో నోటిఫికేషన్‌ ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మావన వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్‌ కార్యాచరణ రూపొందిస్తున్నారు. అలాగే వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీపైనా చర్యలు చేపట్టారు. మరోవైపు పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులు, పల్లె, పట్నం అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి సారించారు.

ఇటు తెలంగాణలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కానుంది. ఆరు గ్యారంటీల అమలు, ఉద్యోగ నియామకాలపై రేవంత్‌ సర్కార్‌ స్పెషల్‌ ఫో కస్‌ పెట్టింది. ఓ వైపు పెండింగ్‌ ప్రాజెక్టులపై దృష్టి సారించి, ఒక్కో ప్రాజెక్టుకు నిర్దేశిత గడువు లోగా పూర్తి చేయాలనే లక్ష్యం తో పనులు కొనసాగిస్తోంది. ఇప్పటికే కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకోగా, తక్షణమే అమలు చేయాలని యోచిస్తోంది. అదే సమయంలో ‘అందరికీ హెల్త్‌ కార్డులు’ ఇవ్వాలనే లక్ష్యాన్ని నిర్దేశించి ఆ దిశగా పయ నిస్తోంది. కేంద్రం జమిలి ఎన్నికలను రుద్దితే ఎదుర్కొనేలా టీపీసీసీ కసరత్తు చేస్తోంది. ప్రజామోదం పొందడమే లక్ష్యం గా చేసుకుని మంత్రులు, పీసీసీ సమన్వయంతో ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. నిత్యం గాంధీభవన్‌లో మం త్రులు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండేలా కార్య క్రమం రూపొందించుకుని ముందుకెళ్తున్నారు. ఇదంతా కేవలం ప్రజామోదం పొందడమే లక్ష్యమని తెలిసిన సత్యమే.

పార్టీలూ అప్రమత్తం
2027లో జమిలి ఎన్నికలొస్తాయన్న వార్తల నేప థ్యం లో అన్ని రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. నిత్యం జనంలో ఉండేలా ప్రణాళిక రచించుకుని ముందుకెళు ్తన్నా యి. తెలుగు రాష్ట్రాలను పరిశీలిస్తే… ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ఓటమి పాలైన తర్వాత కొద్దిరోజులే స్థబ్దతగా ఉన్నప్పటికీ ఎప్పుడైనా మళ్లిd ఎన్నికలు రావచ్చనే సంకేతాలతో మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్‌ అలర్ట్‌ అయ్యాడు. పార్టీ నేతలతో జిల్లాల వారీగా వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలంటూ పిలుపునిస్తున్నారు. అలాగే ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో ప్రధానంగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ నిత్యం ప్రజాసమస్యలపై స్పందిస్తూ జనంలో ఉం టోంది. అగ్రనేతలు కేటీఆర్‌, హరీష్‌రావు రాష్ట్రంలో ఎవరికి ఏకష్టనష్టమొచ్చినా అక్కడికి నేరుగా వెళ్లిపోతున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్నారు.

జమిలి ఎన్నికలు వస్తాయనేది అన్ని రాజకీయ పార్టీలు ఓ నిశ్చితాభిప్రాయానికొచ్చేశాయి. ఆ దిశగా తమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటున్నాయి. ప్రజలను తమ వైపు తిప్పుకునేలా వ్యూహరచనలు చేస్తున్నాయి. అందరూ ఊహిస్తున్నట్లు 2027లో జమిలి ఎన్నికలు జరిగితే తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement