Saturday, November 23, 2024

Exclusive – తడిసి మోపడవుతున్న ఇంటి ఖర్చులు .. దేశం మొత్తం మీదా ఏపీ, తెలంగాణల్లోనే అధికం

అమరావతి, ఆంధ్రప్రభ : కరోనా రాక ముందు జీవితం వేరు.. వచ్చాక వేరు అన్నంతగా పరిస్థితి మారిపోయింది. కోవిడ్‌ తగ్గాక అన్ని రకాల ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిన ప్రభావం ఒకవైపు, అకాల వర్షాలు, ఇతరత్రా కారణాలు ఏదైనా సరే మరోవైపు వెరసి ఇంటి ఖర్చులు మాత్రం తడిసి మోపడవుతున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాలకు ఈ ఖర్చులు భరించలేనంతగా మారాయి. ప్రతి నెలా పెరుగుతున్న ఇంటి ఖర్చులు ఆగస్టు నెలలో మరింతగా పెరిగాయని యాక్సిస్‌ మై ఇండియా కన్జూమర్‌ సెంటిమెంట్‌ ఇండెక్స్‌ సర్వేలో వెల్లడైంది. గత ఐదు నెలల ఇంటి ఖర్చులను పోల్చి చూస్తే ఆగస్టులో మరింత ఎక్కువగా ఉన్నాయని ఈ సర్వే తెలిపింది. దేశం మొత్తం మీద 58 శాతం కుటుంబాలు ఆగస్టు నెలలో ఇంటి ఖర్చు పెరిగిందని చెప్పాయి. అంతకు ముందు రెండు నెలలతో పోలిస్తే ఆగస్టులో ఇంటి ఖర్చు రెండు శాతం పెరిగింది.

దేశం మొత్తంలో ఏపీ, తెలంగాణలోనే అధికంగా
దేశం మొత్తం మీద దక్షిణాదిలో ముఖ్యంగా ఏపీ, తెలంగాణల్లో ఇంటి ఖర్చులు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 71 శాతం కుటు-ంబాలు ఇంటి ఖర్చు పెరిగిందని వాపోగా, తెలంగాణలో 67 శాతం కుటు-ంబాలు ఇదే మాట చెప్పాయని ఆ సంస్ధ పేర్కొంది. పొరుగున ఉన్న కర్ణాటకలో 65 శాతం ఫ్యామిలీలు ఇంటి ఖర్చుల భారం పెరిగిందని తెలిపాయని వెల్లడించింది. జాతీయ స్థాయితో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ఖర్చుల భారం ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఆగస్టు మాసంలో అధికంగా
ఆగస్టు నెలలో పర్సనల్‌ కేర్‌, ఇంటికి అవసరమయ్యే వస్తువుల కోసం పెట్టిన ఖర్చు ఆగస్టు నెలలో 13 శాతం పెరిగిందని 44 శాతం కుటు-ంబాలు తెలిపాయని సర్వే నివేదిక తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్ల్రో ప్రజల నెలవారీ ఖర్చులు భారీగా పెరిగాయని యాక్సిస్‌ మై ఇండియా కన్జూమర్‌ సర్వేలో తేలింది. నిత్యావసరాల కోసం నెలవారీ ఖర్చులు పెరిగాయని తెలంగాణలోని 67 శాతం కుటు-ంబాలు చెప్పాయి. ఏపీలో 63 శాతం, తమిళనాడులో 61 శాతం కుటు-ంబాలు ఇదే మాట చెప్పాయి. ఒక్క నిత్యావసరాలే కాదు కుటు-ంబాలకు ఇతరత్రా ఖర్చులు సైతం ఆగస్టు నెలలో పెరిగాయి. ఏసీ, కారు, ఫ్రిజ్లు లాంటి వస్తువుల కోసం ఆగస్టు నెలలో 6 శాతం అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది.

పెరిగిన మీడియా కంటెంట్‌ వినియోగం
మీడియా అందించే కం-టె-ంట్‌ వినియోగం కూడా పెరిగిందని ఈ సర్వేలో తేలింది. తాము ప్రతి రోజూ టీ-వీ షోలు చూస్తామని సర్వేలో పాల్గొన్నవారిలో 70 శాతం మంది తెలిపారు. వారంలో కనీసం ఒకసారైనా టీ-వీ షోలు చూస్తామని 87 శాతం మంది చెప్పారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ విషయంలో టీ-వీనే ఇప్పటికీ ప్రధాన మాధ్యమంగా నిలిచింది. ఆగస్టు నెలలో వార్తలు చదవడం, చూడటం పెరిగిందని 20 శాతం కుటు-ంబాలు తెలిపాయి. ప్రతిరోజూ వార్తాపత్రికలు చదువుతామని సర్వేలో పాల్గొన్న వారిలో 64 శాతం మంది చెప్పడం గమనార్హం. ప్రింట్‌ మీడియా పట్ల జనాల్లో ఇప్పటికీ ఆదరణ తగ్గలేదనే విషయాన్ని ఇది వెల్లడిస్తోంది. సర్వేలో పాల్గొన్న వారిలో 80 శాతం మంది యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌, ఫేస్‌బుక్‌ షార్ట్స్‌ లాంటి వాటిల్లో వీడియోలు చేస్తున్నట్లు- తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement